డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీని ప్రభావితం చేస్తున్న అతి తక్కువమంది వ్యక్తులలో దిల్ రాజ్ ఒకడు. సినిమా కథ విషయంలో అదేవిధంగా మూవీ మేకింగ్ విషయంలో మరీ ముఖ్యంగా తాను తీసిన మూవీ మార్కెటింగ్ విషయంలో దిల్ రాజ్ కు ఉన్న తెలివితేటలు వలననే అతి తక్కువ కాలంలో ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ స్థానాన్ని చేరుకున్నాడు అంటూ చాలామంది అభిప్రాయపడుతూ ఉంటారు.


అలాంటి వ్యక్తి తన లేటెస్ట్ మూవీ ‘ఎఫ్ 3’ విషయంలో అనుసరిస్తున్న వ్యూహాల గురించి ఇండస్ట్రీ వర్గాలు చాల నిశితంగా పరిశీలిస్తున్నాయి. టాప్ హీరోల సినిమాలు విడుదల అయ్యాయి అంటే చాలు ప్రభుత్వం అనుమతులు తీసుకుని టిక్కెట్ల రేట్లను విపరీతంగా పెంచడం చాలామంది నిర్మాతలు ఒక అలవాటుగా మార్చుకున్నారు.


ఇప్పుడు దానికి భిన్నంగా దిల్ రాజ్ తన ‘ఎఫ్ 3’ మూవీని టిక్కెట్ల రెట్లు పెంచకుండా పాత పద్ధతిలోనే మొదటి వారంలో కూడ టిక్కెట్లను పాత ధరలకు అమ్మే సాంప్రదాయం వైపు యూటర్న్ తీసుకున్నాడు. దీనితో ఈ సినిమాకు మొదటి మూడు రోజులు వచ్చే కలక్షన్స్ ఎమౌంట్ తగ్గుతుంది. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పర్వాలేదు కాని ఏమాత్రం డివైడ్ టాక్ వచ్చినా దాని ప్రభావం మొదటి వారంలో వచ్చే సోమవారం నుండి సినిమా కలక్షన్స్ పై ప్రభావం చూపించడం ఖాయం.


బాగా క్రేజ్ ఉన్న మూవీ విడుదలరోజున మొదటి షో పూర్తి అయ్యేసరికే ఆమూవీలోని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో కనిపించడం ఒక్కరోజు పూర్తి అయిన తరువాత ఆమూవీ పూర్తిగా పైరసీకి గురి కాబడి చాలామంది సెల్స్ లో డౌన్ లోడ్ అవుతున్న పరిస్థితులలో దిల్ రాజ్ అనుసరిస్తున్న ఈ కొత్త పద్ధతి ఎంతవరకు సక్సస్ అవుతుందో చూడాలి. ఈ పద్ధతి వల్ల ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ‘ఎఫ్ 3’ వైపు వస్తారని ఆశిస్తున్న దిల్ రాజ్ ఆశలు ఎంతవరకు నిలబడతాయో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: