రాజమౌళి తరువాత ఫెయిల్యూర్ అన్న పదాన్ని చూడకుండా సినిమాలు తీసిన దర్శకులు కొరటాల అనీల్ రావిపూడి మాత్రమే. అయితే ‘ఆచార్య’ తో కొరటాల సక్సస్ ట్రాక్ కు బ్రేక్ పడింది. ఇప్పుడు లేటెస్ట్ గా విడుదల కాబడుతున్న ‘ఎఫ్ 3’ తో అనీల్ రావిపూడి తన సక్సస్ ట్రాక్ ను కొనసాగించగలడా లేదా అన్నఆశక్తి అందరిలోనూ బాగా ఉంది.  


ఈసినిమాను ఎదోవిధంగా సూపర్ హిట్ చేయాలి అన్న పట్టుదలతో ఈమూవీ ప్రమోషన్ లో అనేక కొత్త పద్ధతులు అవలంభిస్తున్నాడు. లేటెస్ట్ గా ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనీల్ రావిపూడి తన ఫ్యామిలీకి సంబంధించిన ఒక సీక్రెట్ బయటపెట్టాడు. అనీల్ రావిపూడి కాలేజీలో చదువుకునే రోజులలో ఒక అమ్మాయిని ప్రేమించాడట.


ఆ అమ్మాయిని ఏదోవిధంగా పెళ్ళి చేసుకోవాలని అతడు ప్రయత్నించినప్పటికీ ఆమె అనీల్ రావిపూడి ప్రేమకు స్పందించలేదట. ఈ విషయాలు అన్నీ అనీల్ రావిపూడి చదివిన కాలేజీలోనే అప్పట్లో చదువుకుంటున్న అనీల్ రావిపూడి భార్యకు తెలుసు అట. ఆతరువాత అనీల్ రావిపూడి తల్లితండ్రులు కుదిర్చిన ఆ అమ్మాయి ఆనాటి క్లాస్మట్ కావడం అతడికి షాక్ ఇచ్చిందట. పెళ్ళి తరువాత అనీల్ భార్య సందర్భం వచ్చినప్పుడల్లా అలనాటి తన ఫెయిల్యూర్ లవ్ ఎఫైర్ ను గుర్తుకు చేస్తూ తనను ఒక ఆట పట్టిస్తుందని చెప్పాడు.


ఇలాంటి చిన్నచిన్న విషయాలలో హాస్యం పుట్టించ వచ్చు అన్న ఆలోచనతో తాను ‘ఎఫ్ 2’ తీసానని ‘డబ్బు మనిషికి ఆక్సిజన్ కన్నా ఎంత అవసరమో తనకు తెలుసు’ కాబట్టి ఆ విషయాలను దృష్టిలో పెట్టుకుని ‘ఎఫ్ 3’ తీసానని చెపుతున్నాడు. ఈమూవీ పై పాజిటివ్ టాక్ ఉన్నప్పటికీ ఈమూవీ టిక్కెట్లు బుక్ మై షోలో అనుకున్నంత వేగంగా బుక్ అవ్వక పోవడం చూసినిన వారికి ఎంత ప్రమోట్ చేసినా ఆసినిమా టాక్ అదేవిధంగా ఆసినిమా రివ్యూ బయటకు వస్తే కాని ప్రేక్షకులు చూడరా అన్న మాటలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: