అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఒకవైపు పూరీ జగన్నాథ్ తో రెండు సినిమాలు చేస్తూనే మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమా లో కూడా నటిస్తున్నాడు. ఇకపోతే తాజాగా మరో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు కూడా బాగా ప్రచారం అవుతున్నాయి. ఇదిలా ఉండగా విజయ్ దేవరకొండ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన సినిమా లైగర్ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ సినిమా ఆగస్టు 25 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవ్వడానికి సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను డిజైన్ చేశారు దర్శకుడు పూరీ జగన్నాథ్.

ఇక ఆ తర్వాత కూడా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలోని జనగణమన సినిమాలో నటిస్తున్నాడు.  ఇక ఈ సినిమా కూడా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇక అదే విధంగా సమంతతో కలిసి శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషి మూవీ లో కూడా నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ. కాశ్మీర్లో ఇందుకు సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్నారు.  ఇకపోతే లైగర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖుషి సినిమాను విడుదల చేయడానికి విజయ్ దేవరకొండ ప్లాన్ చేస్తున్నాడు. ఇక తర్వాత జన గణ మన సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఇక ప్రస్తుతం  మోహన్ ఇంద్రగంటి ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. త్వరలోనే వీరి కాంబినేషన్ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా ను  కూడా పాన్ ఇండియా లెవెల్ లోకి తెరకెక్కించడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇక ప్రస్తుతం హీరో సుధీర్ బాబు తో ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి అనే సినిమాకి  మోహన్ ఇంద్రగంటి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: