సినిమా కథలను దర్శకులను ఎంచుకోవడంలో చిరంజీవి చాలతెలివిగా వ్యవహరిస్తాడు. ఈవిషయంలో బాలకృష్ణ కొంత వెనకబడి ఉండటంతో చిరంజీవితో పోల్చుకుంటే హిట్స్ విషయంలో బాలకృష్ణ వెనకబడటంతో మెగా స్టార్ ఆదిపత్యం గత కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అలాంటి చిరంజీవి ఇప్పుడు తన కథలు దర్శకుల ఎంపిక విషయంలో తడబడుతున్నాడా అంటూ కొందరు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.


దీనికి ఉదాహరణగా ‘ఆచార్య’ మూవీని మాత్రమే కాకుండా రాబోతున్న చిరంజీవి సినిమాల లైనప్ పై కూడ కొందరికి సందేహాలు వస్తున్నాయి. లేటెస్ట్ గా చిరంజీవి నుండి రాబోతున్న ‘గాడ్ ఫాదర్’ మూవీ ‘లూసీఫర్’ రీమేక్. ఈమూవీని ఇప్పటికే అనేక లక్షలమంది ఓటీటీ లో చూశారు. ఇలాంటి కథను మళ్ళీ ఎంచుకుని తమిళ దర్శకుడు మోహన్ రాజాను నమ్ముకుని మెగా స్టార్ మరో తప్పు ఈసినిమా విషయంలో చేస్తున్నాడా అంటూ కొందరి అభిప్రాయం.


ఇక ఈమూవీ తరువాత చిరంజీవి నటిస్తున్న ‘భోళా శంకర్’ మూవీ కూడ తమిళ రీమేక్. ఈ తమిళ సినిమా ఇప్పటికే తెలుగులో డబ్బింగ్ కాబడి విడుదల అయినప్పటికీ ఆవిషయాన్ని పట్టించుకోకుండా ఫెయిల్యూర్ డైరెక్టర్ మెహర్ రమేష్ ను నమ్ముకుని చిరంజీవి ఆ సినిమాలో నటించడం కూడ మెగా అభిమానులకు పెద్దగా నచ్చినట్లు లేదు. ఇది చాలదు అన్నట్లుగా ఏమాత్రం హిట్ బ్యాక్ గ్రౌండ్ లేని దర్శకుడు బాబిని ఎంచుకుని చిరంజీవి చేస్తున్న ‘వాల్టేర్ వీరయ్య’ మూవీ టైటిల్ కూడ మెగా అభిమానులకు పెద్దగా నచ్చలేదు అని తెలుస్తోంది.


అయితే దీనికి భిన్నంగా ‘అఖండ’ తో సూపర్ సక్సస్ అందుకున్న బాలకృష్ణ గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో ఒక యాక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈసినిమా పూర్తి అయిన వెంటనే అనీల్ రావిపూడితో ఒక డిఫరెంట్ మూవీని చేయడంతో పాటు ఆమూవీలో బాలకృష్ణ 60 సంవత్సరాల వృద్ధుడు గా కనిపిస్తూ మరొక ప్రయోగం చేయబోతున్నాడు. అంతేకాదు తనకు హ్యాట్రిక్ హిట్ ఇచ్చిన బోయపాటితో ‘అఖండ 2’ కు రెడీ అవుతున్నాడు. ఇలా బాలకృష్ణ సినిమాల లైనప్ లో టాప్ దర్శకులతో ప్రయాణం కొనసాగిస్తూ ఉంటే చిరంజీవి మాత్రం ఫెయిల్యూర్ దర్శకులను ఎందుకు ఎన్నుకుంటున్నాడు అంటూ మెగా అభిమానులలో కలవరం కొనసాగుతోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: