లోకనాయకుడు కమల్ హాసన్ గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కమల్ హాసన్ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో వైవిధ్యమైన సినిమాల్లో , ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు. ఇది ఇలా ఉంటే కమల్ హాసన్ నటించిన భారీ బ్లాక్ బస్టర్ సినిమాలలో  భారతీయుడు సినిమా ఒకటి. భారతీయుడు సినిమాకు శంకర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా ఇటు ప్రేక్షకుల నుండి , అటు విమర్శకుల నుండి ప్రశంసలను కూడా అందుకుంది.

భారతీయుడు సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా శంకర్ 'భారతీయుడు 2' సినిమాను ప్లాన్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభించిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత ఎంత కాలానికి ఈ సినిమా తిరిగి ప్రారంభం కాకపోవడంతో దర్శకుడు శంకర్ , రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా ప్రారంభించాడు . ఆ తర్వాత కొన్ని పరిణామాల కారణంగా దర్శకుడు శంకర్ 'భారతీయుడు 2' సినిమాను తెరకెక్కించే పరిణామాలు ఏర్పడ్డాయి.  ఇది ఇలా ఉంటే తాజాగా కమల్ హాసన్ మాట్లాడుతూ భారతీయుడు 2 సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియ జేశాడు.

కమల్ హాసన్ 'భారతీయుడు 2' సినిమా గురించి మాట్లాడుతూ... భారతీయుడు 2 సినిమా ఖచ్చితంగా ఉంటుంది. రెగ్యులర్ షూటింగ్ కూడా మరి కొన్ని రోజుల్లో ప్రారంభం అవుతుంది అని తెలియ జేశాడు. ఇది ఇలా ఉంటే కమల్ హసన్ తాజాగా లోకేష్ కనకరాజు దర్శకత్వంలో తెరకెక్కిన విక్రమ్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా జూన్ 3 వ తేదిన విడుదల కాబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: