రామ్ చరణ్ ఇప్పుడు సినిమాల స్పీడ్ ను పెంచాడు.వరుస సినీమా లలో నటిస్తున్నారు.. మొన్న వచ్చిన ఆర్ఆర్ఆర్ తో మంచి విజయాన్ని అందుకుంది.ఆ సినిమా తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు.. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందాడు.ఇప్పుడు కూడా అంతే జోష్ తో ఆచార్య సినిమా తో ఇటీవల ప్రెక్షకుల ముందుకు వచ్చాడు.ఆ సినిమా భారీ డిజాస్టర్ అయ్యింది. ఇప్పుడు మరో సినిమా లో నటిస్తున్నారు..మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తన కెరీర్‌లోని 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.


ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తుండటంతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే రెగ్యులర్ షూటింగ్ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాలో చరణ్ రెండు విభిన్న పాత్రల్లో నటించబోతున్నట్లు చిత్ర వర్గాలు తెలిపాయి. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ విషయంలో ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.చరణ్ ఐఏఎస్ పాత్రలో నటిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ వెల్లడించింది. దీంతో ఈ సినిమా కథ పవర్ఫుల్ పొలిటికల్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమాను దర్శకుడు తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా.. తాజాగా ఈ సినిమాకు 'అధికారి' అనే టైటిల్ను చిత్ర యూనిట్ ఫిక్స్ చేసిందని.. చరణ్ పాత్రకు పూర్తి న్యాయం చేసే టైటిల్గా ఇది ఉంటుందని శంకర్ అండ్ టీమ్ భావిస్తున్నారట..



అందుకే ఈ సినిమా పేరును మార్చినట్లు తెలుస్తుంది.ఈ విషయంపై చిత్ర యూనిట్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం చరణ్ కెరీర్‌లో సరికొత్త పవర్‌ఫుల్ టైటిల్‌తో రాబోయే సినిమా ఇదే అవుతుంది. ఇక ఈ సినిమాలో చరణ్ సరసన అందాల భామ కియారా అద్వానీ హీరోయిన్‌గా,  నటిస్తోంది. ఈ సినిమాలో పలు భాషలకు చెందిన భారీ క్యాస్టింగ్ కూడా నటిస్తుండటం విశేషం. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా, దిల్ రాజు ఈ సినిమాకు భారీ బడ్జెట్‌ను కేటాయించి, పాన్ ఇండియా మూవీగా తెరకెక్కించాలని భావిస్తున్నారు.. దాంతో ఇప్పుడు అందరు టైటిల్ పై ఫోకస్ పెట్టారు.. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: