యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ మరి కొద్ది రోజుల్లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ మూవీ ని యువ సుధా ఆర్ట్స్ మరియు నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ లు కలిసి సంయుక్తంగా తెరకెక్కించబోతున్నారు. ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించనుండగా రత్నవేలు ఈ మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా పని చేయనున్నట్టు  చిత్ర బృందం  ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.

 ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ గురించి మాత్రం ఇప్పటి వరకు చిత్ర బృంద ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇలా మూవీ అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఈ సినిమా లో ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ గురించి చిత్ర బృందం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఎన్టీఆర్ సరసన నటించే ముద్దుగుమ్మ ఈమె అంటూ రోజుకో హీరోయిన్ పేరు తెరపైకి వస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే రష్మిక మందన , కియారా అద్వానీ , దిశా పటాని , జాన్వీ కపూర్ , సాయి పల్లవి ఇలా అనేక మంది పేర్లు తెరపైకి వచ్చాయి.

కాకపోతే ప్రస్తుతం మాత్రం చిత్ర బృందం సాయి పల్లవి ని హీరోయిన్ గా తీసుకోవడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ను  చూపుతున్నట్లు తెలుస్తోంది. మరి ఇది ఇలా ఉంటే ఈ వార్త కూడా ఒక రూమర్ గా మిగిలిపోతుందో... లేదో తెలియాలి అంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇది ఇలా ఉంటే ఈ సినిమా కోసం అనిరుద్ రవిచంద్రన్ ఒక అదిరిపోయే మాస్ బీట్ సాంగ్ ను కూడా ఇప్పటికే రెడీ చేసినట్లు తెలుస్తోంది.  ఈ సాంగ్ లో ఎన్టీఆర్ డాన్స్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: