పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి ఇప్పటికి 20 సంవత్సరాలు పైనే కావస్తోందట.అప్పటికీ ఇప్పటికీ ఈయన క్రేజ్ ఏ మాత్రం అస్సలు తగ్గలేదు అని చెప్పవచ్చు.


అయితే ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉండే హీరోలలో పోటీతత్వం ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు యువత అంతా కూడా ఎక్కువగా హీరోల అభిమానులు బాగా చీలి పోయారని చెప్పవచ్చు. 20 ఏళ్ల క్రితం అయితే కనీసం.. 100 లో 60 మందికి పైగా పవన్ కళ్యాణ్ స్టైల్ నే ఫాలో అయ్యేవారట.అయితే పవన్ కళ్యాణ్ సినిమాలు సరిగ్గా ఆడకపోవడం ఆ తరువాత రాజకీయాలలోకి వెళ్లడం సరైన కథలు ఎంచుకోక పోవడంతో పవన్ కళ్యాణ్ హవా కాస్త తగ్గింది.


 


పవన్ కు డైరెక్షన్ అంటే ఎక్కువ ఇష్టం ఖుషి సినిమా కు ముందు వరకూ ఆయన సినిమాలకు ఆయన స్వయంగా ఫైట్లు కంపోజ్ కూడా చేసే వారు. కొన్ని చిత్రాలలో సీన్లను పవన్ కళ్యాణ్ డైరెక్ట్ కూడా చేసేవారట. ఖుషి సినిమా కు సంబంధించి.. కోల్కత్తా వెర్షన్ అంత పవన్ కళ్యాణ్ డైరెక్షన్ చేశారట అయితే పవన్ తన సినిమాని డైరెక్టర్లను పక్కన పెట్టేసి తనే డైరెక్ట్ చేసే విషయంలో కొన్ని విమర్శలు కూడా ఎదుర్కొన్నాడని గతం నుంచి ఈ టాక్ వినిపిస్తూనే ఉంది.


తాజాగా సీనియర్ దర్శకుడు అయిన గీతాకృష్ణ సైతం ఈ విషయాన్ని మరొకసారి చెప్పి పవన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట.తన గురించి ఒక కామన్ ఫ్రెండ్ దగ్గర ఇష్టానుసారంగా మాట్లాడేవాడు అని ఆ విషయాన్ని తన స్నేహితులు ఆరేళ్ల తర్వాత తనకు చెప్పారని ఆయన తెలియజేశారట.పవన్ కళ్యాణ్ సినిమాలు మొత్తం తనకే తెలుసు అన్నట్లుగా తానే డైరెక్షన్ చేస్తాడని మరి అంత తెలిసిన వ్యక్తి జానీ లాంటి సినిమా డిజాస్టర్ ఎందుకు తీశాడు అని ప్రశ్నించారు.. ఆ తర్వాత తన డైరెక్షన్లో వచ్చిన సత్యాగ్రహం ఈ సినిమాని హడావిడి చేసి ఆ సినిమా అడ్రస్ లేకుండా చేశారని ఎద్దేవా చేశారట.ఎక్కువగా రీమేక్ సినిమాలను చేస్తూ ఉంటాడు ఈయన. రీమేక్ సినిమా అంటే మరొకచోట హిట్టయిన సినిమా కావడంతో ఆ సినిమాను అక్కడ చూసి ఇక్కడ కూడా తీయవచ్చు. 


పవన్ అసలు డైరెక్టర్ చెప్పింది వినడని వాళ్ల చెప్పేవి ఎందుకు వినాలని మూడ్ లో ఉంటారని గీతాకృష్ణ తెలిపారు. ఇక డైరెక్టర్ ఎస్.జె.సూర్య పై పవన్ కూడా మాన్ హ్యాండ్లింగ్ చేశారని తెలిపారు. ఒక సినిమా షూటింగ్ లో సూర్య పై పవన్ చేయి కూడా చేసుకున్నాడు అనే విషయం కూడా బయటికి వచ్చిందని గీతాకృష్ణ తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్లో ఖుషి మరియు కొమరంపులి వంటి సినిమాలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: