కె.జి.ఎఫ్ చాప్టర్ 1, 2 సినిమాలతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీ నిధి శెట్టి. మోడల్ గా ఇంప్రెస్ చేసిన అమ్మడు మొదటి సినిమానే పాన్ ఇండియా ఆఫర్ అందుకుంది. కె.జి.ఎఫ్ 1, 2 సినిమాలతో ప్రేక్షకులను అలరించిన శ్రీనిధి శెట్టి సౌత్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకుంది. ఇక పాన్ ఇండియా రేంజ్ లో హిట్ కొట్టిన అమ్మడికి భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ క్రమంలో అమ్మడు తన దగ్గరకు వస్తున్న దర్శక నిర్మాతలకు రెమ్యునరేషన్ షాక్ ఇస్తుందట.

నటనకు పెద్దగా స్కోప్ లేకపోయినా సరే కె.జి.ఎఫ్ మొదటి రెండు పార్టులలో తన లుక్స్ తో ఇంప్రెస్ చేసిన శ్రీనిధి శెట్టి ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. ఈ క్రమంలో ఆమెతో సినిమా అంటే భారీ మొత్తం చెల్లించుకోవాల్సిందే అట. దాదాపు సినిమాకు 2 కోట్ల దాకా రెమ్యునరేషన్ అడుగుతుందట కె.జి.ఎఫ్ బ్యూటీ. రీసెంట్ గా ఓ తెలుగు నిర్మాత శ్రీనిధి ఆఫర్ కోసం వెళ్లగా ఆమె 2 కోట్లు రెమ్యునరేషన్ అడిగి షాక్ ఇచ్చిందని తెలుస్తుంది.

ప్రస్తుతం విక్రం కోబ్రా సినిమాలో శ్రీనిధి శెట్టి నటిస్తుంది. ఈ సినిమాతో అమ్మడు మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది. ఈ సినిమా తర్వాత అమ్మడి రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. తప్పకుండా శ్రీనిధి శెట్టి సౌత్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకుంటుందని చెప్పుకుంటున్నారు. మరి అమ్మడు అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి ఆమెకు ఛాన్సులు ఇస్తారా లేదా అన్నది చూడాలి. ఆమె మాత్రం లేట్ అయినా పర్లేదు కానీ అడిగినంత రెమ్యునరేషన్ మాత్రం ఇవ్వాలని డిమాండ్ చేస్తుంది. అంతేకాదు ఎన్.టి.ఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా శ్రీనిధి శెట్టిని హీరోయిన్ గా తీసుకోవాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.
మరింత సమాచారం తెలుసుకోండి: