రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ మూవీ భారీ బడ్జెట్ తో తెరకెక్కి సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ సినిమాకు 610 కోట్ల రూపాయలకు పైగానే షేర్ కలెక్షన్లు వచ్చాయి.


సినిమా ఓటీటీలో విడుదలైనా ఇప్పటికీ పలు థియేటర్లలో ఈ సినిమా విజయవంతంగా ప్రదర్శించబడుతోందట.. ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పోటాపోటీగా నటించి ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా ఈ సినిమా ఓటీటీలో అందుబాటులోకి రావడంతో ఈ సినిమాను థియేటర్లలో చూడని వాళ్లు సైతం ఓటీటీలో ఈ సినిమాను చూసి వారి అభిప్రాయాలను పంచుకుంటున్నారు.


సౌత్ వెర్షన్లు జీ5 ఓటీటీలో అందుబాటులోకి రాగా హిందీ, ఇతర వెర్షన్లు నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చాయట.నెట్ ఫ్లిక్స్ లో ఆర్ఆర్ఆర్ సినిమాను చూసిన హాలీవుడ్ సెలబ్రిటీలు ఈ సినిమాకు సంబంధించిన అభిప్రాయాలను కూడా పంచుకుంటున్నారు. ఆర్ఆర్ఆర్ లో ఎమోషనల్ సీన్లకు ఫిదా అయ్యామని హాలీవుడ్ సెలబ్రిటీల నుంచి అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. బాహుబలి సిరీస్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించిన రాజమౌళికి ఆర్ఆర్ఆర్ తో కూడా మంచి ప్రశంసలు దక్కుతున్నాయి.


 


హాలీవుడ్ ఫిల్మ్ ఫెటర్నిటీ, అక్కడి మీడియా ఆర్ఆర్ఆర్ సినిమాను మాస్టర్ పీస్ గా వర్ణిస్తుండటం విశేషం.. అక్కడి మీడియా నుంచి ఈ సినిమాకు పాజిటివ్ గానే రివ్యూలు వచ్చాయి. నెట్ ఫ్లిక్స్ లో ఆర్ఆర్ఆర్ డిజిటల్ విడుదల కావడంతో ఇప్పటివరకు చూడని ప్రేక్షకులు, సెలబ్రిటీలు ఈ సినిమా గురించి స్పందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమాలోని అద్భుతమైన యాక్షన్ సీక్వెన్స్ లు మరియు గ్రాఫిక్ వార్ సీన్లు ప్రేక్షకులను మెప్పించాయి.

 


ఆర్ఆర్ఆర్ సినిమా విజయంతో రామ్ చరణ్, ఎన్టీఆర్ లకు క్రేజ్ పెరగగా తర్వాత సినిమాల ద్వారా ఈ క్రేజ్ ఆ హీరోలకు ఎంతగా ఉపయోగపడుతుందో క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. చరణ్, తారక్ భవిష్యత్తు సినిమాలు పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కనున్నాయనీ సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: