ఆచార్యతో నిరాశపరచిన మెగాస్టార్ చిరంజీవి తను చేస్తున్న నెక్స్ట్ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఈ క్రమంలో అందరు దర్శకులకు తగిన జాగ్రత్తలు సూచించినట్టు తెలుస్తుంది. లూసిఫర్ రీమేక్ గా చిరు చేస్తున్న గాడ్ ఫాదర్ సినిమా ను తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. సినిమా రష్ చూసిన చిరు కొన్ని మార్పులు చెప్పినట్టు తెలుస్తుంది.

ఇక మరోపక్క మెహెర్ రమేష్ డైరక్షన్ లో భోళా శంకర్ సినిమా లో కూడా చాలా మార్పులు చేశారట. ఆల్రెడీ వేదాళం సినిమా తెలుగు ఆడియెన్స్ చూశారు. ఆ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ సినిమాని ప్రేక్షకులు మెచ్చే అంశాలతో తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత కె.ఎస్ రవీంద్ర అలియాస్ బాబి డైరక్షన్ లో ఓ మాస్ సినిమా చేస్తున్నాడు చిరంజీవి. పవర్, జై లవ కుశ సినిమాలతో తన ప్రతిభ చాటుకున్న కె.ఎస్ రవీంద్ర మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేస్తున్నారు.

ఈమధ్యనే మెగా అభిమానుల సమక్షంలో జరిగిన ఓ మీటింగ్ లో సినిమాపై అంచనాలు పెంచుతూ డైరక్టర్ బాబీ కామెంట్స్ హాట్ టాపిక్ గా నిలిచాయి. సినిమా ప్రతి మెగా అభిమానిని సాటిస్ఫై చేస్తుదని అన్నారు. వాల్తేరు వీరయ్య మీ మనసులు గెలుస్తారని. సినిమా తప్పకుండా ఆశించిన స్థాయిలో ఉంటుందని అంచనాలు పెంచేశారు డైరక్టర్ కె.ఎస్ రవీంద్ర. గాద్ ఫాదర్, భోళాశంకర్ రీమేక్ సినిమాలు కాగా వాల్తేరు వీరయ్య మాత్రమే ఒరిజినల్ కథతో వస్తుంది. మరి ఈ సినిమాతో అయినా చిరు తన స్వాగ్ చూపిస్తారో లేదో చూడాలి. ఆచార్య ఇచ్చిన షాక్ తో మాత్రం మెగాస్టార్ మరోసారి తన సినిమాల విషయంలో చాలా ఫోకస్ గా ఉన్నారని మాత్రం అర్ధమవుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: