ఒక సినిమా హిట్ అయితే అది దేశాలు దాటి సంచలనాలు సృష్టిస్తుంది అన్న దానికి ఇంతకుముందు చాలా ఉదహరణలు చెప్పినా లేటెస్ట్ గా పుష్ప చేసిన సంచలనానికి ఎన్ని ఎక్సాంపుల్స్ చెప్పినా తక్కువే అనిపిస్తుంది. సుకుమార్ డైరక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకుంది. అందులోని బన్నీ సింగేచర్ డైలాగ్ తగ్గేదేలే అయితే దాదాపు అందరు ఆడియెన్స్ ఫాలో అయ్యారు. ఇక సినిమాలోని సాంగ్స్ అయితే ప్రత్యేకమైన క్రేజ్ తెచ్చుకున్నాయి.

అందులో భాగంగానే పుష్ప సినిమాలోని సాంగ్స్ తో అమెరికా వీధుల్లో 13 ఏళ్ల అమ్మాయి వయొలిన్ తో ప్లే చేసింది. పుష్ప సినిమాలో సూపర్ హిట్ సాంగ్ ఉ అంటావా మావ ఉ.. ఉ.. అంటావా సాంగ్ ని తన వయోలిన్ తో ప్లే చేసింది. అంతేకాదు శ్రీవల్లి సాంగ్ ని కూడా ప్లే చేసి అక్కడ జనాలని ఆకట్టుకుంది ఆ అమ్మాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పుష్ప ఫీవర్ ఇంకా తగ్గలేదని ఈ వీడియోతో మరోసారి ప్రూవ్ అయ్యింది.

సెన్సేషనల్ విక్టరీ సాధించిన పుష్ప పార్ట్ 1 కి కొనసాగింపుగా పుష్ప పార్ట్ 2 తెరకెక్కిస్తున్నారు. అంచనాలు లేకుండా వచ్చిన పుష్ప పార్ట్ 1 అదిరిపోయే రేంజ్ లో హిట్ అవగా పార్ట్ 2ని అంతకుమించి అనిపించేలా చేయాలని చూస్తున్నారు. పుష్ప పార్ట్ 2 కోసం నేషనల్ వైడ్ గా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే పుష్ప సెకండ్ పార్ట్ కోసం సుకుమార్ చాలా టైం తీసుకుంటున్నారు. పార్ట్ 2 అంచనాలకు మించి ఉండాలంటే ఆమాత్రం టైం తీసుకోవాల్సిందే అని కొందరు చెబుతున్నారు. పుష్ప పార్ట్ 1 లో జస్ట్ శాంపిల్ మాత్రమే అసలు పుష్ప రాజ్ విశ్వరూపం పార్ట్ 2లోనే ఉంటుందని చెబుతున్నారు. ఫహద్ ఫాజిల్ కూడా సెకండ్ పార్ట్ లో తన సత్తా చాటుతారని తెలుస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: