నిన్నటి తరం హీరోలలో ఒక వెలుగు వెలిగిన స్టార్ హీరో ఎవరంటే భానుచందర్ కూడ ఒకరు అని చెప్పవచ్చు. తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్, కన్నడ వంటి భాషలలో కూడా బాగా ఫేమస్ అయ్యారు ఈ హీరో. ఆ తర్వాత కాలంలోనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఎన్నో సినిమాల్లో ఎంతో మంది స్టార్ హీరోల చిత్రాల్లో కూడా నటించారు. ఒకప్పుడు తన చిత్ర పరిశ్రమలో పాటలతో ప్రేక్షకులను బాగా అలరించిన సంగీత దర్శకుడు మాస్టర్ వేణు కుమారుడే ఈ భానుచందర్.



ఇక బాను చందర్ మార్షల్ ఆర్ట్స్ లో ఆయనకు మంచి పట్టు ఉండటం వల్ల ఇది ఆయన కెరీర్ ప్రారంభంలోనే ఆయన ఎదగడానికి బాగా సపోర్ట్ గా నిలిచింది. అందుచేతనే భానుచందర్ ఎక్కువగా యాక్షన్ సినిమాలోనే నటించి ప్రేక్షకులను థియేటర్ వద్దకు రప్పించారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భానుచందర్ పలు విషయాలను పంచుకోవడం జరిగింది. నేను హీరో అవుతానని తన తండ్రికి ఎప్పుడు నమ్మకం ఉండేది కాదట కాని తన అమ్మకు మాత్రం తనకు కచ్చితంగా హీరో అవుతాడనే నమ్మకం ఉండేదట. ఇక తన తండ్రికి మ్యూజిక్ డైరెక్టర్ గా  రావాల్సిన గుర్తింపు రాలేదట.


దీంతో భానుచందర్ హీరో గా కావాలని నిర్ణయం తీసుకోవడంతో తన స్నేహితులు నువ్వు హీరో ఏంట్రా అని ఎగతాళి చేసేవారట. మీ నాన్న ల సంగీతం నేర్చుకోని ఉండు అంటూ ఎగతాళి చేసేవారట. కానీ తను హీరో అయి చూపిస్తానని వారితో చాలెంజ్ చేశానని తెలిపారు. ఆ తర్వాతి "తనరంగిని "సినిమా ద్వారా హీరోగా అయిన భానుచందర్ తన స్నేహితులకు చూపించారట. ఇక దీంతో తన నటనను చూసి చాలా మెచ్చుకున్నారట. ఇక ఆ తరువాత  నిరీక్షణ, స్వాతి తదితరులు సినిమాలు ఆయనకు మంచి నటుడిగా గుర్తింపు తెచ్చాయి. తను రజనీకాంత్ ఇన్స్పైర్ వల్లే హీరోగా మారానని తెలిపారు. చిరంజీవి తను రూమ్మేట్స్ గా ఉండేవాళ్లమని తెలిపారు అలా.. బైక్ నేర్చు కోవాలి అనుకున్నప్పుడు చిరంజీవి దగ్గర రాయల్ ఎన్ఫీల్డ్  బైక్ తో చిరంజీవి తనకు బైక్ నడపడం నేర్పించాడట. ఇక ఇప్పటికీ కూడా చిరంజీవికి తనకి మధ్య బాగా ఫ్రెండ్షిప్ ఉందని తెలిపారు.. ఇద్దరు కూడా ఏరా ఏరా అనుకుంటాం అని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: