లేటెస్ట్ గా కరణ్ జోహార్ బర్త్ డే పార్టీలో రష్మిక మందన్న కాస్టూం చూసి అందరు అవాక్కయ్యారు. అక్కడకు వచ్చిన సెలబ్రిటీస్ అంతా కూడా రష్మిక వైపే చూసేలా అమండు తన అందచందాలతో మ్యాజిక్ చేసింది. సౌత్ హీరోయిన్స్ ఇక్కడ నేటివిటీకి తగినట్టుగా బయట ఫంక్షన్స్ లో పాల్గొనేప్పుడు కొద్దిగా ట్రడిషనల్ గా కనిపిస్తారు. కానీ రష్మిక మాత్రం బాలీవుడ్ ఆడియెన్స్ ని దృష్టిలో పెట్టుకుని హాట్ హాట్ గా కనిపించింది.
చేస్తున్న సినిమాల్లో మంచి నటన కనబరుస్తున్న రష్మిక తనలో ఈ హాట్ యాంగిల్ కూడా వాడుకోండని బాలీవుడ్ డైరక్టర్స్ కు హింట్ ఇస్తుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఏమైనా నేషనల్ క్రష్ రష్మిక కరణ్ జోహార్ బర్త్ డే ఈవెంట్ లో అందరిని మాయ చేసింది. కేవలం సౌత్ నుండి కొంతమాంది సెలబ్రిటీస్ కు మాత్రమే ఈ బర్త్ డే ఇన్విటేషన్ అందగా అందులో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మాత్రం పాల్గొన్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే రష్మిక పుష్ప పార్ట్ 2 తో పాటుగా దళపతి విజయ్, వంశీ పైడిపల్లి చేస్తున్న సినిమాలో కూడా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత మరో రెండు పెద్ద ప్రాజెక్ట్ లు డిస్కషన్స్ లో ఉన్నాయని తెలుస్తుంది. తెలుగుతో పాటుగా హిందీ పరిశ్రమలో కూడా సత్తా చాటాలని చూస్తుంది రష్మిక.