యంగ్ హీరో రామ్ కెరియర్ ఒక హిట్ పడితే ఆతరువాత మూడు ఫ్లాప్ లుగా కొనసాగుతున్నాయి. వరస పరాజయాలతో సతమతమైపోతున్న రామ్ కు ‘ఇస్మార్ట్ శంకర్’ తిరిగి కెరియర్ బ్రేక్ ఇచ్చింది. అయితే ఆమూవీ ఘన విజయం తరువాత కరోనా వేవ్ లు రావడంతో రామ్ కెరియర్ మళ్ళీ స్లో అయింది. లేటెస్ట్ గా రామ్ బోయపాటి కాంబినేషన్ లో ఒక మూవీ చేయడానికి ఒకే చేసాడు.


ఇప్పటికే ఈమూవీకి సంబంధించిన కథ కూడ ఫైనల్ కావడంతో ఈమూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈమూవీ షూటింగ్ జూన్ మొదటి వారం నుండి ప్రారంభం అవుతుంది అంటున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’ ఘన విజయం తరువాత రామ్ అభిమానులు అతడిని ‘ఉస్తాద్’ రామ్ అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. దీనితో బోయపాటి రామ్ లు తమ మూవీకి ‘ఉస్తాద్’ అన్న టైటిల్ ఫిక్స్ చేయాలని భావించారు.


అయితే ఎవరు ఊహించని విధంగా కీరవాణి కొడుకు శ్రీసింహ హీరోగా ఒక నూతన దర్శకుడు మొదలు పెడుతున్న మూవీకి ‘ఉస్తాద్’ అన్న టైటిల్ ఫిక్స్ అయినట్లుగా వార్తలు రావడం రామ్ కు ఊహించని షాక్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. రామ్ బోయపాటిమూవీ పక్కా మాస్ ఎలిమెంట్స్ ఉన్న మూవీ కాబట్టి ఆమూవీకి ‘ఉస్తాద్’ అన్న టైటిల్ అన్నివిధాల సరిపోతుందని రామ్ భావించినట్లు తెలుస్తోంది.


ఇప్పుడు ఆ టైటిల్ రామ్ చేయి జారిపోవడంతో రామ్ మరొక టైటిల్ వెతుక్కోవలసిన పరిస్థితి. బోయపాటి రామ్ ల కాంబినేషన్ లో రాబోతున్న మూవీని పాన్ ఇండియా మూవీగా తీసి బాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని రామ్ భావిస్తున్నాడు. బోయపాటి మూవీలో రామ్ ఒక డిఫరెంట్ గెటప్ లో కనిపించబోతున్నాడట. ‘దేవదాసు’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన రామ్ 15 సంవత్సరాలు దాటినా ఇప్పటికీ అతడి కెరియర్ లో పూర్తిగా సెటిల్ అవ్వకపోవడం ఒకవిధంగా ఆశ్చర్యపడే విషయం..  


మరింత సమాచారం తెలుసుకోండి: