టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఫుల్ క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరైన అనిల్ రావిపూడి గురించి తెలుగు సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు 100% సక్సెస్ తో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న దర్శకులలో అనిల్ రావిపూడి ఒకరు. అనిల్ రావిపూడి దర్శకుడిగా పటాస్ మూవీ తో తన కెరీర్ ని మొదలు పెట్టాడు. ఆ తర్వాత సుప్రీమ్,  రాజా ది గ్రేట్ , ఎఫ్ 2 , సరిలేరు నీకెవ్వరు సినిమాలకు దర్శకత్వం వహించాడు.

 ఈ మూవీ లు అన్నీ కూడా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. తాజాగా అనిల్ రావిపూడి ఎఫ్ 3 మూవీ కి దర్శకత్వం వహించాడు. నిన్న అనగా మే 27 వ తేదీన థియేటర్ లలో  విడుదలైన ఎఫ్ 3 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది. దాదాపు ఈ మూవీ తో కూడా అనిల్ రావిపూడి మంచి విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకునేలా కనిపిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఎఫ్ 3 సినిమా విడుదల సందర్భంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు.

తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ... సీనియర్ స్టార్ హీరోలు అయిన చిరంజీవి ,  బాలకృష్ణ , వెంకటేష్ , నాగార్జున తో సినిమాలు చేయాలి అని నేను ఇండస్ట్రీ లోకి వచ్చాను. అందులో భాగంగా ఇప్పటికే వెంకటేష్ గారితో రెండు సినిమాలు చేశాను.  బాలకృష్ణ త్వరలో ఓ సినిమా చేయబోతున్నాను. మరియు మిగిలిన ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ సీనియర్ హీరోలు అయిన చిరంజీవి , నాగార్జున తో కూడా త్వరలో సినిమాలు చేస్తాను అని తాజా ఇంటర్వ్యూలో భాగంగా అనిల్ రావిపూడి తెలియజేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: