టాలీవుడ్ ఇండస్ట్రీ కి పటాస్ సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు అనిల్ రావిపూడి.అయితే ఈయన కామెడీనే తన అస్త్రంగా మలుచుకుని..ఆ తరువాత ఆ కాన్సెప్ట్ తోనే సినిమాలు తెరకెక్కిస్తూ వచ్చాడు.అయితే ఇప్పటి వరకు ఆయన తెరకెక్కించిన సినిమాలని పాజిటివ్ టాక్ తెచ్చుకున్నాయి. ఇక దీంతో స్టార్ సీనియర్ హీరోలు సైతం ఆయన తో సినిమాలు చేయడానికి ఇంట్రెస్ట్ చూయిస్తున్నారు. ఇకపోతే ఈ క్రమంలోనే ఆయన వెంకటేష్ , వరుణ్ తేజ్ లతో కలిసి f2 సినిమా తెరకెక్కించాడు.అయితే ఈ సినిమా ఎవ్వరు ఊహించని విధంగా బాక్స్ ఆఫిస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

 ఇక ఇండస్ట్రీ లెక్కలను మార్చేసింది.అయితే  ఇప్పుడు అదే సినిమాకి సీక్వెల్ గా f3 తీశాడు..అంతేకాదు డబుల్ కాదు ట్రిపుల్ ఫన్ తో..సినిమా ను తెరకెక్కించడంతో..ఈ సినిమా కూడా బాక్స్ ఆఫిస్ వద్ద మంచి విజయం అందుకుంది.కాగా  ఈ సినిమాలో మిగతా హీరోయిన్స్ పాపులర్ సినిమాలను వాడుకుంటూ కొంచెం సేపు ఫన్ క్రియేట్ చేశాడు అనిల్ రావిపూడి. ఇక ఆ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ గా నిలిచింది.ఇదిలావుండగా , ఈ ఎపిసోడ్ లో ఓ హీరో ని మిస్ చేశాడు అనిల్ రావిపూడి.అంతేకాదు  మర్చిపోయాడో..లేక కావాలనే చేసాడో తెలియదు కానీ..ఆ స్టార్ హీరో ని మిస్ చేశాడు. అయితే దీంతో ఆయన ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అనిల్ పై ఫైర్ అవుతున్నారు.

 ఇకపోతే వేరే సినిమాల గెటప్స్ నీ..నీ సినిమాలో వాడుకోవడం ఏంటి..నీకు సినిమా తీయ్యడం రాకపోతే.. సైలెంట్ గా కూర్చో..అంతేకానీ, ఇలా చెత్త కామెడీ చేయకు..అంటూ మండిపడుతూన్నారు..... సదరు హీరో ఫ్యాన్స్. అయితే మరి దీని పై అనిల్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి..?ఇక అనిల్ రావిపూడి ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్టు వర్క్ కంప్లీట్ చేసిన అనిల్ రావిపూడి త్వరలోనే ఈ సినిమాని పట్టాలెక్కించనున్నాడు. తండ్రి కూతుర్ల అనుబంధం మధ్యసాగే కథగా ఈ సినిమా ని తీర్చిదిద్దుతున్నారు అనిల్ రావిపూడి. ఈ సినిమాలో బాలయ్య 50 ఏళ్ల వయసులో ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి: