మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా తెరకెక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మొదటి సారి చిరంజీవి , రామ్ చరణ్ ఫుల్ లెన్త్ లో కలిసి నటిస్తూ ఉండటం, అలాగే కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉండడంతో ఆచార్య సినిమాపై సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. అలా భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 29 వ తేదీన థియేటర్ లలో  విడుదల అయిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ దగ్గర నెగటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఆచార్య సినిమా టోటల్ బాక్స్ ఆఫీస్ రన్ కంప్లీట్ అయ్యేసరికి ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ దగ్గర ఎ రేంజ్ కలెక్షన్లను సాధించిందో తెలుసుకుందాం.
 
నైజాం : 12.45 కోట్లు .
సీడెడ్ : 6.21 కోట్లు .
యూ/ఎ : 4.85 కోట్లు .
ఈస్ట్ : 3.24 కోట్లు .
వెస్ట్ : 3.40 కోట్లు .
గుంటూర్ : 4.59 కోట్లు .
కృష్ణ : 3.09 కోట్లు
నెల్లూర్ : 2.94 కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఫైనల్ బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి ఆచార్య సినిమా 40.77 కోట్ల షేర్ , 59.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా 2.80 కోట్లు
ఓవర్ సీస్  : 4.78 కోట్లు

 
ప్రపంచవ్యాప్తంగా ఫైనల్ బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి ఆచార్య సినిమా 48.36 కోట్ల షేర్ ,  76.00 కోట్ల క్రాస్ కలెక్షన్లను సాధించింది.
131.20 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న ఆచార్య సినిమా 132.50 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగింది.
చివరగా బాక్సాఫీస్ రన్ ముగిసే సరికి 84.14 కోట్ల నష్టాలను మిగిల్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: