కోలీవుడ్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ఉన్న హీరోలలో ఒకరు ఆయన శివ కార్తికేయన్ తాజాగా డాన్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమానే తెలుగులో కాలేజ్ డాన్ పేరుతో విడుదల చేశారు. డాన్ మూవీ తమిళ తెలుగు భాషల్లో ఒకే రోజు విడుదల అయ్యింది. 

ఇది ఇలా ఉంటే కాలేజ్ డాన్ మూవీ కి తెలుగు లో ఏ మాత్రం ప్రమోషన్స్ లేకుండా నేరుగా విడుదల చేశారు. అలా కాలేజ్ డాన్ మూవీ కి తెలుగులో ఏ మాత్రం ప్రమోషన్ లేకపోవడం వల్ల ఈ సినిమాకు మొదటి రోజు చాలా తక్కువ కలెక్షన్లు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నమోదు అయ్యాయి.  కాకపోతే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో మెల్ల మెల్లగా మంచి కలెక్షన్లను రాబట్టింది. చివరిగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కంటే కూడా ఎక్కువ కలెక్షన్లను టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా కాలేజ్ డాన్ మూవీ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి కలెక్షన్లను రాబట్టి టాలీవుడ్ ఇండస్ట్రీ లో  క్లీన్ హిట్ గా నిలిచింది. ఇలా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన డాన్ మూవీ మరి కొన్ని రోజుల్లో  'ఓ టి టి' లోకి రాబోతోంది.

 అసలు విషయం లోకి వెళితే... డాన్ మూవీ ప్రముఖ 'ఓ టి టి' సంస్థ నెట్ ఫ్లిక్స్ లో జూన్ 10 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ విషయాన్ని ప్రముఖ 'ఓ టి టి' సంస్థ నెట్ ఫ్లిక్స్ తాజాగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే థియేటర్ లలో ప్రేక్షకులను అలరించిన ఈ సినిమా 'ఓ టి టి' లో ప్రేక్షకులను ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. శిబి చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శివ కార్తికేయన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: