టాలీవుడ్ ఇండస్ట్రీలో యువ హీరోల్లో ఒకరైన విశ్వక్ సేన్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నగరానికి ఏమైంది మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన విశ్వక్ సేన్ ఆ తర్వాత ఫలక్ నామ దాస్ , హిట్ , పగల్ వంటి పలు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నడు.

ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఏర్పరచుకున్న విశ్వక్ సేన్ తాజాగా అశోకవనంలో అర్జున కళ్యాణం అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో నటించాడు. ఈ మూవీ కి రవికిరణ్ కోలా కథను అందించగా,  విద్యా సాగర్ చింతా ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. బాపీనీడు. బి ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించడం, జై క్రిష్‌ ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. కార్తీక్‌ పలనీ ఈ మూవీ కి సినిమాటోగ్రాఫర్ గా పని చేయగా రుక్సార్‌ దిల్లాన్, రితికా నాయక్, గోపరాజు రమణ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటించారు. మంచి అంచనాల నడుమ మే 6 వ తేదీన థియేటర్ లలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి టాక్ ను తెచ్చుకుంది.  అలాగే మంచి కలెక్షన్లను కూడా రాబట్టింది.

ఇలా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతుంది. అసలు విషయం లోకి వెళ్తే...  అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా జూన్ 3 వ తేదీ నుండి ఆహా 'ఓ టి టి' ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు తాజాగా ఆహా 'ఓ టి టి' సంస్థ అధికారికంగా ప్రకటించింది. మరి ఈ సినిమా 'ఓ టి టి' ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: