టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.. జూనియర్ ఎన్టీఆర్ కు కేవలం 21 ఏళ్ల వయసులో తిరుగులేని స్టార్ డమ్ ను తెచ్చిపెట్టిన సినిమా సింహాద్రి . జూనియర్ ఎన్టీఆర్ కు సింహాద్రి సినిమాతో విపరీతంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ పెరిగిపోయింది.


సింహాద్రి సినిమా తరువాత ఎన్ని హిట్ సినిమాలు చేసినా కూడా ఎన్టీఆర్‌ను సింహాద్రి రేంజ్‌లోనే ఊహించుకోవడం కాస్త మైనస్ అయ్యిందట.జూనియర్ ఎన్టీఆర్ 20 ఏళ్ల వయసులోనే స్టార్ హీరోలను పక్కన పెట్టేసి మరి నెంబర్ వన్ కుర్చీ కోసం పోటీ పడ్డాడట. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన సింహాద్రి సినిమా దర్శకుడు రాజమౌళికి రెండవ సినిమా అని అందరికి తెలిసిందే.


సినిమా జూలై 9 2003 లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే సింహాద్రి సినిమా వెనక తెరవెనక చాలా తతంగమే నడిచిందట.. అయితే సింహాద్రి కథను రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఎప్పుడో రెడీ చేసుకున్నారట, బి.గోపాల్ దర్శకత్వంలో బాలయ్య హీరోగా ఈ సినిమాను చేయాల్సి ఉండగా, అప్పటికే బాలకృష్ణ పల్నాటి బ్రహ్మ నాయుడు సినిమా చేస్తుండడంతో అందుకు బాలయ్య నో చెప్పడం ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాలో నటించడం ఇలా చకచకా జరిగిపోయాయనీ తెలుస్తుంది. ఈ కథ ఎలా పుట్టింది అన్న విషయానికి వస్తే.


రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ తన అసిస్టెంట్‌తో కలిసి వసంత కోకిల సినిమా చూస్తున్నప్పుడు సింహాద్రి ఆలోచన ఆయన మదిలో తట్టిందనీ . క్లైమాక్స్‌లో కమల్‌హాసన్‌ను చూసి శ్రీదేవి గుండెల్లో గుచ్చేసి వెళ్లిపోతుందట. తన అసిస్టెంట్‌తో విజయేంద్రప్రసాద్ దీని గురించి చర్చిస్తూ ఇదే ఇంటర్వెల్ సీన్‌గా చేసి కథ రాయడం స్టార్ట్ చేశారట విజయేంద్ర ప్రసాద్‌. అందుకే ఇంటర్వెల్ బ్యాంగ్‌లో భూమిక జూనియర్ ఎన్టీఆర్‌ను గుండెల్లో గుచ్చేస్తుందట. దాని చుట్టూనే కథ అల్లుకున్నారట. అలా జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా విడుదల అయ్యి అప్పట్లో బాక్సాఫీస్ వద్ద 11.4 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగగా, 25 కోట్లకు పైగానే వసూళ్లు వచ్చాయి.. అంతేకాకుండా బయ్యర్లకు ఈ సినిమా ద్వారా రు. 14 కోట్లు భారీ లాభాలు కూడా వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: