టాలీవుడ్ యువ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఈ దర్శకుడు తాజాగా తెరకెక్కించిన 'ఎఫ్3' చిత్రం శుక్రవారం మే 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కంప్లీట్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇక తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో పది కోట్లకు పైగా షేర్ సాధించి గ్రాండ్ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది ఈ సినిమా. ఇక ఈ సినిమా విజయంతో అనిల్ రావిపూడి అండ్ టీం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఎఫ్ 2 సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే కదా.

దీంతో ఎఫ్3 పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను కచ్చితంగా అందుకుందని ఫిలిం క్రిటిక్స్ సైతం చెబుతున్నారు. విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సినిమాలో తమ కామెడీతో అదరగొట్టేసారు అంటూ సినిమాపై ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్ రావిపూడి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పటాస్, సుప్రీమ్, రాజాదిగ్రేట్, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్ 2, ఎఫ్3 ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి కి ఓ డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందట. అదేంటంటే ఎప్పటికైనా మెగాస్టార్ చిరంజీవి నటించిన 'జగదేకవీరుడు అతిలోకసుందరి' లాంటి ఓ ఫాంటసీ చిత్రాన్ని తెరకెక్కించాలని ఉన్నట్లు అనిల్ రావిపూడి తెలియజేశాడు.

అలాగే అన్ని ఎమోషన్స్ ఉండే 'మాయాబజార్' లాంటి హిస్టరీ లో నిలిచిపోయే ఒక ఫ్యామిలీ స్టోరీ ని సైతం తెరకెక్కించాలని ఉన్నట్లు కూడా తెలిపాడు అనిల్ రావిపూడి. ఇక దర్శకుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినప్పుడు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో సినిమాలు చేయాలని అనుకున్నా. వెంకటేష్ గారి తో రెండు సినిమాలు చేశాను అని.. బాలయ్య గారితో చేయబోతున్నానని.. చిరంజీవి, నాగార్జున గారితో చేస్తే నా కోరిక తీరుతుంది అంటూ అనిల్ రావిపూడి తాజా ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. అన్నట్టు బాలయ్యతో చేయబోయే సినిమాని కూడా అనిల్ రావిపూడి అతిత్వరలోనే పట్టాలెక్కించనున్నట్లు సమాచారం...!!

మరింత సమాచారం తెలుసుకోండి: