విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ కలిసి నటించిన మల్టీస్టారర్ మూవీ F3. ఈ సినిమాలో తమన్నా, మెహ్రీన్ కౌర్, సోనాల్ చౌహాన్ హీరోయిన్స్ గా నటించారు. సినిమా లో కమెడియన్స్ సునీల్, ఆలి కూడా తమ నటనతో మెప్పించారు. శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. లాజిక్కులు, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ లాంటివి ఆలోచించకుండా సరదాగా ఫ్యామిలీ మొత్తం చూసే సినిమాగా f3 ఉందని అంటున్నారు.

ఇక ఈ సినిమా ఫస్ట్ డే కలక్షన్స్ అదిరిపోయాయి. సినిమా మొదటి రోజు 13.35 కోట్ల కలక్షన్స్ తో అదరగొట్టింది. విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ఇద్దరి కెరియర్ లో ఫస్ట్ డే హయ్యీస్ట్ రికార్డ్ ఇదని చెప్పొచ్చు. ఏపీ, తెలంగాణా లో ఫస్ట్ డే 10.35 కోట్లని రాబట్టింది. మరోసారి వెంకటేష్ తన కామెడీతో ఆడియెన్స్ ని మెప్పించగా వరుణ్ తేజ్ కూడా తెలంగాణా యాసలో తన నటనతో ఆకట్టుకున్నారు.

F2 సినిమా సూపర్ హిట్ అవడంతో f3 మీద అంచనాలు పెరిగాయి. అందుకే సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా నిర్మత దిల్ రాజు తెరకెక్కించారు. ఈ సినిమా బిజినెస్ కూడా 80 కోట్ల దాకా జరిగిందని తెలుస్తుంది. మొదటి రోజు 23 కోట్ల గ్రాస్ అంటే 13.35 కోట్ల షేర్ తో f3 వసూళ్లతో అదరగొట్టింది. ఎలాగు పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి వీకెండ్ సినిమా వసూళ్లు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. వీకెండ్ వరకు 50 కోట్లు తెస్తే f3 సెన్సేషనల్ హిట్ కొట్టినట్టే లెక్క. f3 సినిమా హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో F4 కూడా ఉంటుందని చెప్పిన అనీల్ రావిపుడి కామెంట్స్ ని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు. f3 సినిమా చూసిన ఆడియెన్స్ అంతా కూడా ఈవీవీ సినిమాలను గుర్తు చేసుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: