జూనియర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస పెట్టి పాన్ ఇండియా సినిమాలను లైన్ లో పెడుతూ ముందుకు దూసుకు పోతున్నాడు.

అందులో భాగంగా ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కబోతోంది. ఈ సినిమా ఎన్టీఆర్ కెరియర్ లో 30 వ సినిమాగా తెరకెక్కబోతుంది. జూనియర్ ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబినేషన్ లో  తెరకెక్కబోతున్న మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చి కూడా చాలా రోజులు అవుతుంది. ఈ సినిమాకు రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేయనుండగా , అనిరుద్ రవిచంద్రన్ సంగీతాన్ని అందించనున్నాడు. ఎన్టీఆర్సినిమా తర్వాత కే జి ఎఫ్ మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ను తెచ్చుకున్న ప్రశాంత్  నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.  ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో 31 సినిమాగా తెరకెక్కబోతుంది.

ఇది ఇలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా తర్వాత కూడా మరో క్రేజీ దర్శకుడి సినిమాలో పని చేయనున్నట్లు తెలుస్తోంది.  ఆ క్రేజీ దర్శకుడు మరెవరో కాదు తమిళంలో మంచి విజయాలను అందుకొని క్రేజీ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వెట్రిమారన్. వెట్రిమారన్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ కు ఒక కథను వెట్రిమారన్ వినిపించగా ఆ కథ బాగా నచ్చిన ఎన్టీఆర్ , వెట్రిమారన్ దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.  మరి ఇప్పటి వరకు ఈ వార్తకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: