దగ్గుబాటి రానా గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించిన దగ్గుపాటి రానా తెలుగులో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. అలాగే రానా తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాల్లో కూడా నటించి అక్కడ కూడా తనకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు.

ఇలా పాన్ ఇండియా రేంజ్ లో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియట్ చేసుకున్న దగ్గుబాటి రానా తాజాగా విరాట పర్వం మూవీ లో హీరోగా నటించాడు. నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ లో రానా సరసన సాయి పల్లవి హీరోయిన్ గా నటించగా , ఒక కీలక పాత్రలో ప్రియమణి కూడా ఈ మూవీ లో నటించింది. ఈ మూవీ కి మాకు నీది నాది ఒకే కథ ఫెమ్ వేణు ఉడుగుల దర్శకత్వం వహించగా,  ఈ సినిమాకు సురేష్ బెబ్బులి సంగీతాన్ని సమకూర్చారు. మొదటి నుండి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న విరాట పర్వం సినిమా జూన్ 17 వ తేదీన థియేటర్లలో విడుదల అయ్యింది.  నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీని మిక్స్ చేసి  తెరకెక్కించిన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ లభించడంతో ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్లు వస్తున్నాయి. మరి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజులకు గాను  సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం. విరాట పర్వం సినిమా 1 వ రోజు ప్రపంచవ్యాప్తంగా 1.42 కోట్ల షేర్ , 2.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.

2 వ రోజు ప్రపంచవ్యాప్తంగా 0.85 కోట్ల షేర్ , 1.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
3 వ రోజు ప్రపంచవ్యాప్తంగా  0.87 కోట్ల షేర్ , 1.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
విరాట పర్వం సినిమా ప్రపంచవ్యాప్తంగా 2 వ రోజు తో పోలిస్తే 3 వ రోజు మంచి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: