నాచురల్ స్టార్ నాని తాజాగా అంటే సుందరానికి మూవీలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన నజ్రియా హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు టాలీవుడ్ ఇండస్ట్రీలో మెంటల్ మదిలో , బ్రోచేవారెవరురా లాంటి రెండు సినిమాలతో రెండు విజయాలను అందుకున్న వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ నుంచి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు,  పాటలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా మంచి అంచనాలతో థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమాకు సెకండ్ ఆఫ్ బాగానే ఉన్నప్పటికీ,  ఫస్ట్ ఆఫ్ మాత్రం కాస్త స్లో అయ్యింది అని కామెంట్లు వచ్చాయి. ఆ కామెంట్ ల ప్రభావం ఏ మాత్రం పడకుండా అంటే సుందరానికి మూవీ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తోంది  ఇప్పటి వరకు 10 రోజుల బాక్సాపీస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న అంటే సుందరానికి మూవీ ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ల గురించి తెలుసుకుందాం.

1 వ రోజు ప్రపంచవ్యాప్తంగా 5.82 కోట్ల షేర్ ,  10 కోట్ల గ్రాస్.
2 వ రోజు ప్రపంచవ్యాప్తంగా 4.78 కోట్ల షేర్ , 8.50 కోట్ల గ్రాస్ .
3 వ రోజు ప్రపంచవ్యాప్తంగా 4.35 కోట్ల షేర్ , 7.75 కోట్ల గ్రాస్ .
4 వ రోజు ప్రపంచవ్యాప్తంగా 1.16 కోట్ల షేర్ , 2.10 కోట్ల గ్రాస్ .
5 వ రోజు ప్రపంచవ్యాప్తంగా 1.21 కోట్ల షేర్ , 2.20 కోట్ల గ్రాస్ .
6 వ రోజు ప్రపంచవ్యాప్తంగా 0.65 కోట్ల షేర్ , 1.20 కోట్ల గ్రాస్ .
7 వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 0.42 కోట్ల షేర్ , 0.85 కోట్ల గ్రాస్ .
8 వ  రోజు ప్రపంచ వ్యాప్తంగా 0.17 షేర్ , 0.33 కోట్ల గ్రాస్ .
9 వ రోజు ప్రపంచవ్యాప్తంగా 0.35 కోట్ల షేర్ , 0.60 కోట్ల గ్రాస్ .
10 వ రోజు ప్రపంచవ్యాప్తంగా 1.17 కోట్ల షేర్ , 2.10 కోట్ల గ్లాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

 
10 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా అంటే సుందరానికి మూవీ 20.08 కోట్ల షేర్ , 35.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: