బాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన రన్ బీర్ కపూర్ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రన్ బీర్ కపూర్ ఇప్పటి వరకు నేరుగా ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించక పోయినప్పటికీ హిందీలో నటించిన సినిమాల ద్వారానే రన్ బీర్ కపూర్ తెలుగులో కూడా మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. 

ఇది ఇలా ఉంటే రన్ బీర్ తాజాగా షంషేర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. సంజు సినిమా తర్వాత చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకుని రన్ బీర్ కపూర్ నటించిన సినిమా కావడంతో ఈ సినిమాపై బాలీవుడ్ లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా లోని ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేయగా ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ లభించింది. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో రన్ బీర్ కపూర్ పొడవాటి జుట్టు తో , గుబురు గడ్డం మరియు మీసాలతో ఉన్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. షాంషేర్ సినిమాను జూలై 22 వ తేదీన హిందీ ,  తెలుగు , తమిళ్ భాషలలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

మూవీ లో రన్ బీర్ కపూర్ 1800 కాలం నాటి స్వతంత్ర కాంక్ష కలిగిన దోపిడీ దొంగల కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కి కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించగా సంజయ్ దత్ ,వాణి కపూర్ ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. మరి ఈ మూవీ తో రన్ బీర్ కపూర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: