టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోలలో ఒకరు అయినా రామ్ పోతినేని గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. రామ్ పోతినేని ఆఖరుగా రెడ్ అనే సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. రెడ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని దక్కించుకుంది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం రామ్ పోతినేని 'ది వారియర్' మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకు తమిళ్ దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తూ ఉండగా ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది.  ఈ సినిమాలో రామ్ పోతినేని పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఈ సినిమాలో ప్రతినాయకుడి పాత్రలో ఆది పినిశెట్టి కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం టీజర్ ను విడుదల చేయగా ఈ టీజర్ లో రామ్ పోతినేని పవర్ ఫుల్ మాస్ డైలాగ్ లతో అదరగొడుతు ఉంటే,  ఆది పినిశెట్టి కూడా తన విలనిజాన్ని అదిరిపోయే రేంజ్ లో చూపించాడు. ఇది ఇలా ఉంటే తాజాగా ది వారియర్ మూవీ నుండి ఒక అదిరిపోయే అప్డేట్  ను చిత్ర బృందం  విడుదల చేసింది. తాజాగా ది వారియర్ చిత్ర బృందం ఈ సినిమాలోని 'విజిల్' అనే లిరికల్ సాంగ్ ను 22 జూన్ 2022 వ తేదీన సాయంత్రం 7 గంటల 12 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.

ఇప్పటికే ఈ సినిమా నుండి చిత్ర బృందం కొన్ని పాటలను విడుదల చేయగా, ఆ పాటలకు ప్రేక్షకుల నుండి విశేష స్పందన లభిస్తోంది. మరి ఈ 'విజిల్' సాంగ్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలు జూలై 14 వ తేదీన తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: