సినీ ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోవడానికి పూరి జగన్నాథ్ కుమారుడు చాలానే ప్రయత్నాలు చేస్తున్నారు. మెహబూబా, రొమాంటిక్ సినిమాలతో అలరించనున్నాడు. ఇప్పుడు తాజాగా చోర్ బజార్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు ఈ నెల 24న విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది ఈ సినిమా ప్రమోషన్లలో ఆకాష్ పూరి చాలా బిజీగా ఉన్నారు. తాజా ఇంటర్వ్యూలో పలు విషయాలను అభిమానులతో పంచుకోవడం జరిగింది. ఇప్పుడు వాటి గురించి చూద్దాం.ఇంతకుముందు సినిమాలలో చిన్న పిల్లాడిలా కనిపించే వాడినని.. కానీ ఈ సినిమాలో మాత్రం కాస్త హీరోలా కనిపిస్తున్నాను అని తన స్నేహితులు తెలిపారు అని తెలియజేశారు. ఇక ఈ చిత్రంలో కాస్త ఫిట్గా కనిపిస్తుందని తన అనుకుంటున్నట్లుగా తెలిపారు. ఇప్పటివరకు కేవలం లవ్ యాక్షన్స్, ఎమోషన్స్ వంటి చిత్రాలను చేశాను ఇప్పుడు ఫ్యామిలీ సినిమాలు, కామెడీ కంటెంట్ ఉన్న సినిమాలను చేయాలనుకుంటున్నాం అని తెలిపారు. తన సినిమా కథలకు సంబంధించి కథలను నేనే వింటాను నేనే నిర్ణయం తీసుకుంటారని కూడా తెలిపారు. ఎప్పుడు కూడా తనలో ఒక డైరెక్టర్ కొడుకుగా కథలు వినలేదట. కేవలం ఒక సాధారణ ఆడియన్ గా మాత్రమే కథలను వింటానని తెలిపారు.


నచ్చితే కథను చేస్తాను లేదంటే.. లేదు. ఇండస్ట్రీలో తనకు తానుగా నిలబడాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. ఇండస్ట్రీలో ఏ తండ్రి కూడా తన కొడుక్కి స్టార్డమ్ ఇవ్వలేరు.. ఎవరికివారు కష్టపడి స్టార్డమ్ను సంపాదించుకోవాలి సిందే.. నేను నాగోల్ చేరుకొని.. తన తండ్రి పేరు నిలబెట్టాలనుకుంటున్నాను అని తెలిపారు. ఒకానొక సమయంలో తమ ఆస్తి అంతా పోయింది అనే విషయం తెలియ కూడదని.. తన తల్లి వారిని హాల్ హాస్టల్లో చేరిందట. అయితే వారు వేసుకొనే బట్టలలో తినే తిండిలో తేడా వచ్చింది మా కార్లు కూడా అమ్మేశారు అనే విషయం ఆలస్యంగా తెలిసింది ఆ సమయంలో మా నాన్న కి మా అమ్మ పెద్ద సపోర్ట్ గా నిలిచింది అని తెలిపారు. మొదటి నుంచి తన తండ్రి చాలా స్థానం లేదని అందువల్లనే మీరు త్వరగా కోలుకున్నారని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: