రెబల్ స్టార్ ప్రభాస్ హీరో గా మారుతి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవలే దర్శకుడు మారుతి,  ప్రభాస్ సినిమా గురించి మాట్లాడుతూ... ప్రభాస్ ను డార్లింగ్ , బుజ్జిగాడు మూవీ లలో చూపించిన విధంగా చూపించాలని కోరికగా ఉంది అని చెప్పుకొచ్చాడు.

అలా మారుతి  స్టేట్మెంట్ ఇవ్వడంతో ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే మూవీ కి రాజా డీలక్స్ అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే ఈ మూవీ లో ప్రభాస్ సరసన ముగ్గురు హీరోయిన్ లు నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ ని మారుతి హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కించనున్నట్లు, అందు కోసం ఇప్పటికే ప్రత్యేకంగా ఒక భారీ సెట్ ను కూడా చేయించడానికి చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది.  అలాగే ఆ ప్రత్యేక సెట్ లోనే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కానున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే... ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న రాజా డీలక్స్ సినిమా షూటింగ్ వచ్చే సంవత్సరం సమ్మర్ తర్వాత మొదలు కానున్నట్లు, ఆ తర్వాత సినిమా షూటింగ్ ను శర వేగంగా పూర్తి చేసి 2024 సంక్రాంతి కానుకగా ఈ మూవీ ని విడుదల చేయాలని చిత్ర బృందం ప్రణాళికలు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇలా ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కబోయే రాజా డీలక్స్ మూవీ కోసం ఇంకా చాలా కాలం వేచి చూడవలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: