నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు బాలకృష్ణ తెలుగులో అనేక విజయాలను బాక్సాఫీస్ దగ్గర అందుకొని ఇప్పటికి టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోగా కొనసాగుతున్నాడు . ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్రేజీ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నా నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ మాస్ దర్శకులలో ఒకరు అయిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న  సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ఈ సినిమాలో బాలకృష్ణ సరసన అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ కథానాయికగా కనిపించబోతుంది .

మూవీ లో వరలక్ష్మి శరత్ కుమార్ ఒక కీలక పాత్రలో కనిపించనుంది .  దునియా విజయ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా భాగం షూటింగ్ పూర్తి అయ్యింది . ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. ప్రస్తుతం చిత్ర బృందం బాలకృష్ణ పై హై వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. ఈ యాక్షన్ సన్నివేశాలకు రామ్ లక్ష్మణ్ మాస్టర్ కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు . ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా టీజర్ ను విడుదల చేయగా ఈ టీజర్  ప్రేక్షకుల నుండి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకుంది.

ఇది ఇలా ఉంటే బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని డిసెంబర్ 23 వ తేదీన విడుదల చేయాలని చిత్ర బృందం డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఇప్పటికే పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో విడుదల అయిన అఖండ సినిమాతో బాలకృష్ణ భారీ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకున్నాడు. మరి ఈ సినిమాతో ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుండో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: