జూనియర్ ఎన్టీఆర్ గురించి దీని ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీ లలో నటించి ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. ఇంత కాలం పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలలో ఒకరిగా కొనసాగిన ఎన్టీఆర్,  రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ఇండియా వైడ్ గా ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు.  

ఇలా ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఇండియా వైడ్ గా  క్రేజ్ ను సంపాదించుకున్న ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ ని టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకులలో ఒకరు అయినా కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటికే వచ్చేసింది. ఈ క్రేజీ మూవీ కె8 రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా పని చేయనుండగా, అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ ని అందించనున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటి వరకు ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఆ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించబోతోంది అనే విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా కన్ఫామ్ చేయలేదు. ఇది ఇలా ఉంటే ఈ క్రేజీ మూవీ ఇంటర్వెల్ సీక్వెన్స్ కోసం కొరటాల శివ భారీ యాక్షన్ సన్నివేశాన్ని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్  తన కెరియర్ లో ఎప్పుడూ కనిపించనంత యాక్షన్ మూడ్ లో ఈ ఇంటర్వెల్ సన్నివేశంలో కనిపిస్తాడట.

ఈ యాక్షన్ సన్నివేశం కోసం చిత్ర బృంద సెట్ ను కూడా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంటర్వెల్ సీక్వెన్స్ ఈ మూవీ కె హైలైట్ గా ఉండబోతునట్లు సమాచారం. ఈ మూవీ ఇంటర్వెల్ సన్నివేశం కోసం కొరటాల శివ భారీ యాక్షన్ సన్నివేశాన్ని రేడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ సన్నివేశం కోసం భారీ మొత్తాన్ని డబ్బును ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: