దగ్గుపాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన విరాట పర్వం సినిమా ఎన్నో అంచనాల నడుమ జూన్ 17 వ తేదీన థియేటర్ లలో విడుదల అయిన విషయం మన అందరికి తెలిసిందే.  ఈ మూవీ లో ప్రియమణి ఒక కీలక పాత్రలో నటించగా , సురేష్ బెబ్బులి ఈ మూవీ కి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో దర్శకుడు వేణు ఉడుగుల నక్సలైట్ బ్యాక్ డ్రాప్ లో ప్రేమ కథను జోడించి తెరకెక్కించాడు.

ఈ సినిమాలో రానా మరియు సాయి పల్లవి నటనకు గాను ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి అనేక ప్రశంసలు దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే మొదటి నుండి మంచి అంచనాలు కలిగి ఉన్న విరాట పర్వం సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి నాలుగు రోజుల పాటు పర్వాలేదు అనే రేంజ్ లో కలెక్షన్లు దక్కాయి. కాకపోతే 5 రోజు మాత్రం ఈ సినిమాకు కలెక్షన్ లు దారుణంగా పడిపోయాయి. మరి విరాట పర్వం సినిమా ప్రపంచ వ్యాప్తంగా 5 రోజులకు సాధించిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

1 వ రోజు విరాట పర్వం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 1.42 కోట్ల షేర్ , 2.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
2 వ రోజు విరాట పర్వం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 0.85  కోట్ల షేర్ , 1.40  కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
3 వ రోజు విరాట పర్వం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 0.87 కోట్ల షేర్ , 1.45 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
4 వ రోజు విరాట పర్వం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 0.38 కోట్ల షేర్ , 0.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
5 వ రోజు విరాట పర్వం మూవీ ప్రపంచ వ్యాప్తంగా 0.24 కోట్ల షేర్ , 0.40 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది.
ఇలా విరాట పర్వం సినిమా కలెక్షన్ లు 4 వ రోజు తో పోల్చి చూస్తే 5 వ రోజు చాలా వరకూ పడిపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: