శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా అందాల ముద్దుగుమ్మ శ్రీ లీల హీరోయిన్ గా గౌరీ రొనాంకి దర్శకత్వంలో దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో పెళ్లి సందD మూవీ తక్కిన విషయం మన అందరికీ తెలిసిందే.  ఇది వరకు శ్రీకాంత్ హీరోగా తెరకెక్కిన పెళ్లి సందడి మూవీ మంచి విజయం సాధించడంతో సినీ ప్రేమికులు తాజా పెళ్లి సందD సినిమాపై మంచి అంచనాలే పెట్టుకున్నారు. 

ఎన్నో అంచనాల నడుమ రోషన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా తెరకెక్కిన పెళ్లి సందD సినిమా 15 అక్టోబర్ 2021 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది  మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదలైన పెళ్లి సందD సినిమా పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని బాక్సాఫీస్ దగ్గర అందుకుంది. ఇలా బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పటి వరకు 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాలేదు. అనేక సార్లు ఈ సినిమా 'ఓ టి టి' విడుదల గురించి అనేక వార్తలు బయటకు వచ్చాయి. కాకపోతే అవన్నీ కూడా రూమర్లు లాగానే మిగిలిపోయాయి. ఇది ఇలా ఉంటే తాజాగా రోషన్ హీరోగా శ్రీ లీల హీరోయిన్ గా తెరకెక్కిన పెళ్లి సందD మూవీ అఫీషియల్ 'ఓ టి టి' విడుదల తేదీ వచ్చేసింది.

పెళ్లి సందD  సినిమా ప్రముఖ 'ఓ టి టి' సంస్థలలో ఒకటి అయిన జీ 5 'ఓ టి టి' లో స్ట్రీమింగ్ కాబోతుంది. ఈ విషయాన్ని తాజాగా జీ 5 'ఓ టి టి' సంస్థ ప్రకటించింది. పెళ్లి సందD మూవీ ను జూన్ 24 వ తేదీ నుండి  స్ట్రీమింగ్ చేయనున్నట్లు జీ 5 'ఓ టి టి' సంస్థ తాజాగా ప్రకటించింది. మరి థియేటర్లలో పర్వాలేదు అనే రేంజ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా 'ఓ టి టి' లో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: