టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు అయినా విశ్వక్ సేన్ 'ఈ నగరానికి ఏమైంది' మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో విశ్వక్ సేన్ కు టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఫలక్ నామ దాస్ , హిట్ , పగల్ , అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా లతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా విశ్వక్ సేన్ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. 

ఈ మధ్యనే విడుదలైన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమాతో  విశ్వక్ సేన్ మంచి విజయాన్ని అందుకొని ఫుల్ జోష్ లో వున్నాడు.  ఆకాశంలో అర్జున కళ్యాణం మూవీ విజయంతో మంచి జోష్ లో ఉన్న విశ్వక్ సేన్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. వీటితో పాటు తాజాగా విశ్వక్ సేన్ మరో సినిమాను కూడా లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా , నటుడిగా అదిరిపోయే క్రేజ్ ను సంపాదించుకున్న అర్జున్ సర్జా దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికి తెలిసిందే. ఈ సినిమాలో అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ హీరోయిన్ గా నటించబోతోంది. ఈ సినిమాతో ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా కొంత కాలం క్రితమే చిత్ర బృందం విడుదల చేసింది.

సినిమా రోడ్ జర్నీ నేపథ్యంలో సాగబోతుంది. ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో జగపతి బాబు కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్డేట్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. ఈ సినిమాకు కే జి ఎఫ్ మూవీ మూవీ కి సంగీత దర్శకుడిగా పని చేసిన రవి బుస్రుర్ సంగీతాన్ని అందించనున్నట్లుగా చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఇందుకు సంబంధించి చిత్ర బృందం ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: