టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరు ఆయన నాగ చైతన్య ప్రస్తుతం వరుస పెట్టి సినిమా లలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే నాగ చైతన్య హీరోగా విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన థాంక్యూ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది . ఈ సినిమాతో పాటు నాగ చైతన్య విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న దూత అనే వెబ్ సిరీస్ లో కూడా  నటిస్తున్నాడు . 

అలాగే హిందీ సినిమా లాల్ సింగ్ చద్ద లో కూడా నాగ చైతన్య ఒక కీలక పాత్రలో నటించాడు . ఈ సినిమాలో అమీర్ ఖాన్ హీరోగా నటించగా కరీనా కపూర్ హీరోయిన్ గా నటించింది . ఇలా ఇప్పటికే వరుస ప్రాజెక్ట్ లతో ఫుల్ బిజీగా ఉన్న నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఒక సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. నాగ చైతన్య ,  వెంకట్ ప్రభు దర్శకత్వంలో నటించబోయే సినిమా నాగ చైతన్య కు కెరీర్ పరంగా 22 వ సినిమా . తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది . నాగ చైతన్య 22 వ సినిమాకు సంబంధించిన బిగ్ అనౌన్స్మెంట్ ను రేపు ఉదయం 9 గంటల 1 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తాజాగా ఒక పోస్టర్ ద్వారా తెలియ జేసింది .

మానాడు లాంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత వెంకట్ ప్రభు దర్శకత్వం వహించబోయే సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెట్టుకున్నారు. నాగ చైతన్య,  వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమాను శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై ప్రవీణ్ కుమార్ నిర్మించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: