నాచురల్ స్టార్ నాని తాజాగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన అంటే సుందరానికి మూవీలో హీరోగా నటించిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమాలో నజ్రియా కథానాయికగా నటించింది.

శ్యామ్ సింగరాయ్ వంటి మంచి విజయవంతమైన సినిమా తర్వాత నాని నటించిన సినిమా కావడం,  మలయాళ, తమిళ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ వున్న నజ్రియా మొట్ట మొదటి సారి ఈ మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇవ్వడం, మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా లాంటి వరుస విజయాల తర్వాత వివేక్ ఆత్రేయ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో అంటే సుందరానికి సినిమాపై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలాగే ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు కూడా ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.  అలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న కారణంగా అంటే సుందరానికి మూవీ కి ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల భారీ ప్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకుంది. అలా భారీ ఎత్తున ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను జరుపుకున్న అంటే సుందరానికి మూవీ 31 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగింది. అలా భారీ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలో దిగిన అంటే సుందరానికి మూవీ కి మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర కాస్త నెగటివ్ టాక్ దక్కింది.

అలా ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఆ టాక్ ప్రభావంతో ఈ సినిమాకు కలెక్షన్లు కూడా రోజు రోజుకు తగ్గుతూ వచ్చాయి. ఇప్పటి వరకు 12 రోజుల బాక్సాపీస్ రన్ కంప్లీట్ చేసుకున్న అంటే సుందరానికి మూవీ ప్రపంచ వ్యాప్తంగా 20.57 కోట్ల షేర్ , 36.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. దీనితో అంటే సుందరానికి మూవీ బాక్సాఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలవాలి అంటే ఇంకా 10.43 కోట్ల కలెక్షన్లను రాబట్టి వలసి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: