నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం అఖండ సినిమా సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అఖండ మూవీ తో బాక్సాఫీస్ దగ్గర 100 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్ల  గొట్టే బాక్సాఫీస్ ను షేక్ చేసిన బాలకృష్ణ ప్రస్తుతం గోపీ చంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో హీరోగా నటిస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్ పూర్తి అవ గానే బాలకృష్ణ టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్క బోయే సినిమాలో నటించబోతున్నాడు .

ఇప్పటికే బాలకృష్ణ, గోపీ చంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ కావడంతో మరి కొన్ని రోజుల్లోనే బాలకృష్ణ, అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్క బోయే సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే బాలకృష్ణ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో టాలీవుడ్ సీనియర్ హీరోలలో ఒకరు అయిన రాజశేఖర్ కూడా నటించబోతున్నట్లు తెలుస్తోంది . అయితే ఈ మూవీ లో రాజశేఖర్ పక్క కామెడీ పాత్ర చేయబోతున్నట్లు తెలుస్తోంది . సీనియర్ బాలకృష్ణ కు స్నేహితుడి గా రాజశేఖర్ నటించబోతున్నట్లు తెలుస్తోంది .

ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో రాజశేఖర్ తన సొంత వాయిస్ తోనే ఈ మూవీ కి డబ్బింగ్ చెప్పుకొనున్నట్లు తెలుస్తోంది . ఇది ఇలా ఉంటే ఈ సినిమాలో బాలకృష్ణ కూతురుగా శ్రీ లీల నటించబోతున్నట్లు తెలుస్తోంది . ఈ సినిమాను అనిల్ రావిపూడి తన స్టైల్లో కామెడీ జోనర్ లో కాకుండా , బాలకృష్ణ స్టైల్ లో మాస్ యాక్షన్ జోనర్ లో తెరకెక్కించబోతున్నాట్లు అనేక సార్లు చెప్పుకొచ్చాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: