సినిమా ఇండస్ట్రీలో ఒక్కో వారం ఒకే రోజు అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి. అందులో ఏవైనా స్టార్ హీరో నటించిన సినిమా గాని , లేక స్టార్ దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ సినిమా గాని ఉన్నట్లయితే ఇతర సినిమాలను ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోరు. కాక పోతే ఒకే రోజు చాలా చిన్న హీరోల సినిమాలు కనుక విడుదల అయినట్లు అయితే వాటిలో అన్ని సినిమాలలో  ఏ సినిమాకు మంచి టాక్ వస్తే ఆ సినిమాను మాత్రమే చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇది ఇలా అంటే రేపు అనగా జూన్ 24 వ తేదీన టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సందడి చేయడానికి దాదాపు 7 సినిమాలు రెడీగా ఉన్నాయి. రేపు అనగా జూన్ 24 వ తేదీన విడుదల కావడానికి రెడీ గా ఉన్న 7 సినిమాల గురించి తెలుసుకుందాం.
 
సమ్మతమే : కిరణ్ అబ్బవరం హీరోగా చాందిని చౌదరి హీరోయిన్ గా తెరకెక్కిన సమ్మతమే సినిమా రేపు అనగా జూన్ 24 వ తేదీన విడుదల కాబోతుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డు నుండి యు / ఎ సర్టిఫికెట్ లభించింది.


చోర్ బజార్ : పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ హీరోగా తెరకెక్కిన చోర్ బజార్ సినిమా రేపు అనగా జూన్ 24 వ తేదీన విడుదల కాబోతుంది.


గ్యాంగ్ స్టార్ గంగరాజు మూవీ జూన్ 24 వ తేదీన విడుదల కాబోతుంది.


7 డేస్ 6 నైట్స్ జూన్ 24వ తేదిన విడుదల కాబోతుంది.


సదా నన్ను నడిపే మూవీ జూన్ 24వ తేదిన విడుదల కాబోతుంది.


పెళ్లికూతురు పార్టీ మూవీ జూన్ 24వ తేదిన విడుదల కాబోతుంది.


సాఫ్ట్వేర్ బ్లూస్ మూవీ జూన్ 24వ తేదిన విడుదల కాబోతుంది.


రేపు విడుదల కాబోయే సినిమాలలో  సమ్మతమే మరియు చోర్ బజార్ మూవీపై ప్రేక్షకుల్లో అంతో ఇంతో అంచనాలు ఉన్నాయి. మరి రేపు విడుదల కాబోయే సినిమాల్లో ఎ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ మేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: