టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ దర్శకులలో ఒకరు అయిన సాగర్ కే చంద్ర గురించి సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సాగర్ కే చంద్ర ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానా హీరోలుగా తెరకెక్కిన భీమ్లా నాయక్ సినిమాకు దర్శకత్వం వహించాడు.

సినిమా మంచి విజయం సాధించడంతో పాటు అదిరిపోయే కలెక్షన్ లను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. ఇలా భీమ్లా నాయక్ మూవీ తో దర్శకుడు సాగర్ కే చంద్ర టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇది ఇలా ఉంటే భీమ్లా నాయక్ సినిమా వచ్చి ఇప్పటికి  చాలా రోజులే అవుతున్నా ఇప్పటి వరకు సాగర్ కే చంద్ర తదుపరి మూవీ కి సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సాగర్ కే చంద్ర తన తదుపరి సినిమాకు సంబంధించిన పనులు అన్నిటిని పూర్తి చేసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా సాగర్ కే చంద్ర తన తదుపరి సినిమాను నితిన్ హీరోగా తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే దర్శకుడు సాగర్ కే చంద్ర నితిన్ కు ఒక స్టోరీ లైన్ ను వినిపించగా , సాగర్ కే చంద్ర చెప్పిన స్టోరీ లైన్ నచ్చిన నితిన్ వెంటనే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన కూడా రాబోతున్నట్లు తెలుస్తోంది.  ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నితిన్ మాచర్ల నియోజక వర్గం మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. మాచర్ల నియోజక వర్గం మూవీ ని ఆగస్టు 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం కొంత కాలం క్రితమే అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: