దర్శకుడు రాజమౌళి భారీ సినిమాలు చేస్తాడా అన్న సంగతే కానీ పెద్ద హీరోలను హ్యాండిల్ చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆయన ఇప్పటివరకు సినిమాలు చేసిన హీరోలు అందరూ కూడా తన ద్వారా తన వల్ల స్టార్ హీరోలు అయిన వారే తప్ప తన ప్రమేయం లేకుండా స్టార్ హీరో అయిన వారిని ఎప్పుడూ కూడా హ్యాండిల్ చేయలేదు. పవన్ కళ్యాణ్ మహేష్ బాబు అల్లు అర్జున్ వంటి హీరోలను ఆయన ఇప్పటి వరకు డైరెక్ట్ చేయలేదు.

ఎన్టీఆర్ ప్రభాస్ రామ్ చరణ్ వంటి హీరోలు అందరూ కూడా రాజమౌళి సినిమాలతోనే పెద్ద హీరోలుగా మారారు. కెరీర్ ప్రారంభం నుంచి ఈ హీరోలు రాజమౌళి కి పరిచయం కాబట్టి, తను తీసిన సినిమాలతోనే వారు స్టార్ హీరోలు అయ్యారు కాబట్టి వారితో ఎలా అంటే అలా సినిమాలను చేయించుకునే వాడు. కానీ ఒక పెద్ద స్టార్ ను హ్యాండిల్ చేయడం అంటే మామూలు విషయం కాదు. భారీ చిత్రాల దర్శకుడే అయిన కూడా రాజమౌళి ఓ స్టార్ హీరో ను ఎలా హ్యాండిల్ చేస్తాడో మహేష్ బాబు సినిమాతో చూడాలి.

రాజమౌళి మహేష్ బాబు లు కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ బాబు రాజమౌళి మాటను ఎంత వరకు వింటాడు అనేది చూడాలి. దర్శకత్వ పరంగా రాజమౌళి టేకింగ్ కు ఎటువంటి వంక పెట్టనవసరం లేదు. ఇంతవరకు ఒక పెద్ద హీరోతో ఆయన సినిమా చేయడం జరిగింది లేదు కాబట్టి ఈ చిత్రం ఏ విధంగా తెరకెక్కుతోంది అనేది చూడాలి. వచ్చే ఏడాది సంక్రాంతి కి ఈ సినిమా తెరకెక్కబోతుంది అని అంటున్నారు. రాజమౌళి సినిమాలు చేసే విషయంలో ఎక్కువ సమయాన్ని తీసుకుంటాడనే విమర్శ ఉంది ఈ సినిమాతో ఆ విమర్శను పోగొట్టుకోవ్వాలని రాజమౌళి భావిస్తున్నాడట.  దానిలో ఆయన సఫలం అవుతాడా అనేది చూడాలి. సర్కారు వారి పాట సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని డిసెంబర్ కల్లా పూర్తి చేయబోతున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: