సినిమా పరిశ్రమలోని వారిపై కొంత మంది వ్యక్తులు విమర్శలు చేయడం సహజమే. ముఖ్యంగా హీరోలపై చాలా మంది విమర్శలు చేస్తూ ఉంటారు. ఒక్కసారి ఫ్లాప్ అందుకుంటే సదరు హీరో పై ఎన్నో రకాల విమర్శలు చేస్తూ ఉంటారు అయితే ఆయన సినిమాల గురించి విమర్శలు చేసే పర్వాలేదు కానీ వ్యక్తిగత విషయాల పై కూడా విమర్శలు చేస్తూ ఉంటారు. ఏదేమైనా హీరోల మనుగడ అంతా సులువైనది ఏమీ కాదని ఇప్పుడు హీరోల మీద జరుగుతున్న కొన్ని ట్రోల్స్ ను బట్టి చెప్పవచ్చు.

ఆ విధంగా ఈ తరం హీరోలలో ఎక్కువగా విమర్శలను అందుకుంటూ ఉంటాడు విజయ్ దేవరకొండ. ఎటు వంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా రావడం స్టార్ హీరో గా ఎదగడమే ఇంతగా విమర్శలను ఎదుర్కోవడానికి ముఖ్య కారణం. ఇప్పటికే సెటిలైన కొంత మంది పెద్ద హీరోల అభిమానులు ఈ హీరోను యాక్సెప్ట్ చేయకపోవడం ఒకటైతే కొంతమంది ఇండస్ట్రీలోని పెద్ద తలకాయలు కావాలని ఆయనపై విమర్శలు చేయిస్తూ ఉంటారు. 

ఇంత మంది పెద్ద పెద్ద హీరోలు ఉండగా ఒక సాధారణ హీరో ఇంతటి స్టార్ గా ఇండియా స్టార్ గా ఎదగడం వారికి మింగుడుపడటం లేదనే చెప్పాలి. ఇప్పు డు తొలిసారి ఆయన పాన్ ఇండియా హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఈ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తుందని చిత్రబృందం భావిస్తుంటే ఇంకొకవైపు కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఈ సినిమా గురించిన చెడు ప్రచారం చేస్తున్నారు. ఒక హీరోని కిందకి లాగడం కోసం ఒక సినిమాను ఈ విధంగా ట్రోల్ చేయడం నిజంగా దారుణం అనే చెప్పాలి. సినిమా కోసం ఎంతో మంది ఎన్నో రకాలుగా కష్టపడుతూ ఉంటారు. అలాంటి వారి కలల మీద నీళ్లు చల్లడమే అవుతుంది ఇటువంటి ట్రోల్స్ చేయడం. 

మరింత సమాచారం తెలుసుకోండి: