టాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొంత మంది దర్శకులకు అదృష్టం ఏమాత్రం కలిసిరాదు. సక్సెస్ వెంటే ఉన్నా కూడా అదృష్టం కలిసి రాకపోవడంతో వారు సినిమాలను తెరకెక్కించలేకపోతున్నారు.  సినిమా సినిమాకు అనుకోకుండా గ్యాప్ రావడం వంటివి జరగడంతో వారిలో తీవ్రమైన నిరాశ ఎక్కువగా కలుగుతోంది. అలాంటి దర్శకుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన హరీష్ శంకర్ అనే చెప్పాలి. రవితేజ హీరోగా నటించిన షాక్ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు ఈ దర్శకుడు.

తొలి సినిమా ఫ్లాప్ అయినా కూడా ఈ దర్శకుడు పై నమ్మకం ఉంచి రవితేజ మ రొక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ విధంగా వీరి కాంబినేషన్లో తెరకెక్కిన రెండో సినిమా మంచి విజయాన్ని అందుకోగా ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా తన తాను నిరూపించుకున్నాడు హరీష్ శంకర్. ఆ వెంటనే పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ సినిమా చేసే అవకాశాన్ని అందుకుని హరీష్ శంకర్ అగ్ర దర్శకుడు గా మారిపోయాడు. ఆ సినిమా ఇటు పవన్ కళ్యాణ్ కు అటు తనకు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చిపెట్టింది.

అలా పెద్ద హీరోలతో సినిమాలు చేసే దర్శకుడిగా ఎదిగిన హరీష్ శంకర్ ఎన్టీఆర్ అ ల్లు అర్జున్ వంటి హీరోలతో సినిమాలు చేసి మంచి విజయాలను అందుకున్నారు. అయితే సినిమా పరిశ్రమలోకి దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి చాలా సంవత్సరాలే అయిపోతున్న కూడా ఆయన పది సినిమాలు కూడా విడుదల చేయకపోవడం ఆయన అభిమానులను ఎంతగానో నిరాశపరుస్తుంది. ఇప్పుడు కూడా ఆయన పవన్ కళ్యాణ్ తో కలిసి భవదీయుడు భగత్సింగ్ అనే సినిమా చేయడానికి సిద్ధం అవుతున్నాడు ఈ చిత్రం యొక్క అధికారిక ప్రకటన జరిగి చాలా రోజులు అవుతున్నా కూడా ఆయన ఈ సినిమా ఇంకా మొదలు పెట్టకపోవడం ఆయనకు ఉన్న బ్యాడ్ లక్ ను సూచిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: