పాన్ ఇండియా స్టార్ విజయ్ దేవరకొండ హీరో గా పూరీ జగన్నాథ్ దర్శకత్వం లో లైగర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిం దే. ఇప్పటివరకు ఒక్క పాన్ ఇండియా సినిమా చేయకపోయినా సరే విజయ్ దేవరకొండ కు ఈ స్థాయిలో క్రేజ్ ఉండడం విశేషం. అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోగా మారిన విజయ్ దేవరకొండ తన కష్టంతోనే ఇంతటి స్థాయి కలిగిన హీరోగా మారాడు అని చెప్పాలి.

ఆ విధంగా ఇప్పుడు లైజర్ సినిమా కోసం దేశమంతా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తుంది అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో ఈ సినిమా కు సంబంధించిన చర్చ ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది ప్రతి రోజు ఈ సినిమాకు సంబంధించిన బ్యాగులతో ట్రెండ్ అవుతూ ఉంటుంది సోషల్ మీడియా. విజయ్ దేవర కొండ కు అభిమానులు కూడా భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో వారు ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ల కోసం ఈ సినిమా యొక్క విశేషాలకోసం చిత్ర నిర్మాణ సంస్థ పై ఎప్పటికప్పుడు ఒత్తిడి చేస్తూనే ఉంటారు. 

అలా టాలీవుడ్లో అందరూ కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారని దీన్ని బట్టి తెలుస్తుంది బాలీవుడ్ హీరోయిన్ ఈ చిత్రం లో కథానాయికగా నటిస్తుండగా కీలక పాత్రలు పోషిస్తూ ఉండడం విశేషం. స్పోర్ట్స్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా తరువాత విజయ్ దేవరకొండ విభిన్నమై న చిత్రాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇప్పటికే ఖుషి అనే ఓ ప్రేమకథ చిత్రాన్ని చేస్తున్నాడు ఇందులో ప్రేమ తోపాటు మంచి యాక్షన్ అంశం కూడా మిళితమై ఉంటుంది అని అంటున్నారు. ఇకపోతే జనగణమన అనే మరొక సినిమా కూడా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది ఇది కూడా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమానే కవడం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: