ఇటీవల కాలంలో వచ్చే టాలీవుడ్ సినిమాలకు ఓ ప్రత్యేకత ఉంది తెలుగులో మాత్రమే కాదు బాలీవుడ్లో కూడా రాణిస్తూ అక్కడివారికి నిద్రలేకుండా చేస్తున్నాయి తెలుగు సినిమాలు ఆ విధంగా ఇటీవల కాలంలో విడుదలైన చాలా సినిమాలు హిందీ లో మంచి కలెక్షన్లను సాధించి ఉన్నాయి ఇప్పుడు రాబోయే సినిమాలో ఓ చిత్రం తప్పకుండా బాలీవుడ్లో భారీ స్థాయిలో రాణిస్తుంది అని అంటున్నారు. అదే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లైగర్ సినిమా. 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు ఆగస్టు 25వ తేదీన రాబోతుంది విడుదల తేది దగ్గర పడుతుండటంతో ఈ సినిమా యొక్క ప్రమోషన్ కార్యక్రమాలు చేయడానికి చిత్ర బృందం రంగం సిద్ధం చేసుకుంటోంది. తప్పకుండా ఈ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకోవాలని చిత్రబృందం భావిస్తూ ఉండగా ఈ సినిమాకు సంబంధం లేని ఓ ప్రమోషన్ జరగడం ఇప్పుడు చిత్రానికి ఎంతగానో ప్లస్ అవుతుంది.

ఇటీవల విడుదలైన కొన్ని పాన్ ఇండియా సినిమాలు హిందీలో భారీగా రాణించాయి దానికి సంబంధించిన చర్చ సోషల్ మీడియాలో జరుగుతూ ఉండగా ఆ తర్వాత అంతటి స్థాయిలో సినిమా ఏది అంటే అనే చర్చ ఎక్కువ అవుతుంది దానికి తోడు ప్రతి రోజు విజయ్ దేవరకొండ అభిమానులు ఈ సినిమా గురించిన ఈ విషయాన్ని తీసుకు రావడంతో ఈ సినిమా అక్కడ ట్రెండ్ అవుతుంది. బాలీవుడ్లో ఎన్నో అంచనాలు కలిగిన ఈ సినిమా ఏమాత్రం మంచి టాక్ తెచ్చుకున్న కూడా భారీ వసూళ్లను అందుకోవడం ఖాయం అని అంటున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి లో విజయం సాధిస్తుందో చూడాలి. ఇకపోతే ఈ సినిమా తర్వాత కూడా విజయ్ దేవరకొండ మంచి యాక్షన్ భరితమైన సినిమాలు చేస్తున్నారు. అవి కూడా సంచలనాత్మక విజయాలు అందుకుంటాయని అన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: