సంక్రాంతి పండగ వచ్చింది అంటే టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల సినిమాలతో బాక్స్ ఆఫీస్ దదరిల్లుతూ ఉంటుంది.  స్టార్ హీరోలు తమ సినిమాలను సంక్రాంతి కి విడుదల చేసే ఉద్దేశంతో సినిమా షూటింగ్ లను కూడా అందుకు తగిన విధంగా ప్లాన్ చేస్తూ సినిమాలను సంక్రాంతి కి విడుదల చేస్తూ ఉంటారు . అందులో భాగంగా సంక్రాంతి కి ఇప్పటికీ చాలా కాలమే ఉన్నా ఇప్పటికే కొన్ని సినిమాలను సంక్రాంతికి విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందాలు ప్రకటించాయి . అలా ఇప్పటి వరకు అధికారికంగా సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సినిమాల గురించి తెలుసు కుందాం .

ఆది పురుష్ : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ఓం రౌత్  దర్శకత్వంలో తెరకెక్కిన ఆది పురుష్ సినిమాని సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాలో కృతి సనన్ హీరోయిన్ గా కనిపించనుండగా సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించ బోతున్నాడు .


పివిటి 04 : పంజా వైష్ణవ్ తేజ్ హీరో గా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వంలో పంజా వైష్ణవ్ తేజ్ కెరీర్ లో 4వ సినిమాగా తెరకెక్కబో తున్న ఈ సినిమాను సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది .


వారసుడు : కోలీవుడ్ స్టార్ హీరో ల్లో ఒకరైన తళపతి విజయ్ హీరోగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకులలో ఒకరు అయిన వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కుతున్న వారసుడు సినిమా ని సంక్రాంతి కి విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది . ఈ సినిమా లో రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తుండగా , ఈ సినిమా ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు .

మరింత సమాచారం తెలుసుకోండి: