టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి మాస్ ఇమేజ్ కలిగి ఉన్న హీరోలలో ఒకరు అయినా గోపీచంద్ తాజాగా మారుతి దర్శకత్వం లో తెరకెక్కిన పక్కా కమర్షియల్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . ఈ సినిమాలో గోపీచంద్ సరసన రాశి కన్నా హీరోయిన్ గా నటించగా, ఈ సినిమాలో రావు రమేష్ , సత్య రాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు . 

మూవీ ని జులై 1 వ తేదీన విడుదల చేయబోతున్నారు . ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో ఇప్పటికే పక్కా కమర్షియల్ మూవీ ట్రైలర్ ను చిత్ర బృందం విడుదల చేసింది . ఈ ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండటంతో పక్కా కమర్షియల్ సినిమా ట్రైలర్ కు ప్రస్తుతం ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభిస్తోంది . ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ ను మరింత వేగ వంతం చేయాలని ఉద్దేశం లో ఉన్నట్లు తెలుస్తోంది . అందులో భాగంగా పక్కా కమర్షియల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారీ ఎత్తున నిర్వహించేందుకు చిత్ర బృందం సన్నాహాలు మొదలు పెట్టినట్లు సమాచారం. అందులో భాగంగా పక్కా కమర్షియల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూన్ 26 వ తేదీన నిర్వహించనున్నట్లు సమాచారం .

అయితే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నాట్లు తెలుస్తోంది .  ఇది ఇలా ఉంటే ఇప్పటికే మహిళా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కిన సిటీ మార్ మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న గోపీచంద్ 'పక్కా కమర్షియల్' మూవీ తో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: