దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన 'ఆర్ ఆర్ ఆర్' మూవీ థియేటర్ లలో ఏ రేంజ్ సంచలన విజయాన్ని అందుకుందో మన అందరికీ తెలిసిందే.  రాజమౌళి ఈ సినిమాకు దర్శకత్వం వహించడం, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు హీరోలుగా నటించడంతో మొదటి నుండి ఈ సినిమా పై పాన్ ఇండియా రేంజ్ లో  ప్రేక్షకులు ఆసక్తి చూపించారు. 

ఎన్నో సార్లు విడుదల వాయిదా పడి ఎట్టకేలకు మార్చి 25 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా విడుదలైన మొదటి రోజు నుండే బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. 'ఆర్ ఆర్ ఆర్' మూవీ షేక్ చేస్తూ దాదాపు 1100 వందల కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్లగొట్టింది.  అలా ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ ను షేక్ చేసి కలెక్షన్ల వర్షం కురిపించిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కొన్ని రోజుల నుండే 'ఓ టి టి' ప్లాట్ ఫామ్ లలో స్ట్రీమింగ్ అవుతుంది. 'ఆర్ ఆర్ ఆర్' తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ 'ఓ టి టి' స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థ జీ 5 దక్కించుకోగా,  హిందీ 'ఓ టి టి' హక్కులను ప్రముఖ 'ఓ టి టి' సంస్థ నేట్ ఫ్లిక్స్ దక్కించుకుంది.

ఇందులో భాగంగా తాజాగా నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి'  సంస్థ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా కు సంబంధించి ఒక పోస్టర్ ను విడుదల చేసింది. ఆ పోస్టర్  ద్వారా నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' లో భారతదేశం నుండి అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రం గాను మరియు ప్రపంచవ్యాప్తంగా 45 మిలియన్ హావర్స్ వ్యూస్ వచ్చినట్లు నేట్ ఫ్లిక్స్ 'ఓ టి టి' సంస్థ తాజాగా ప్రకటించింది. ఇలా ఇప్పటికి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా నేట్ ఫ్లిక్స్ లో అదరగొడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

rrr