ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి సినీ ప్రేమికులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు అర్జున్ కొన్ని రోజుల క్రితం విడుదలైన పుష్ప మూవీ తో పాన్ ఇండియా రేంజ్ లో మంచి విజయాన్ని అందుకున్న విషయం మాన్ అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సుకుమార్ దర్శకత్వం వహించగా ఈ మూవీ లో అల్లు అర్జున్ సరసన రష్మీక మందన కథానాయికగా నటించింది.

పుష్ప పార్ట్ 1 మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న అల్లు అర్జున్ మరి కొన్ని రోజుల్లో పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ లో పాల్గొన్న బోతున్నాడు. అయితే పుష్ప పార్ట్ 2 షూటింగ్ చాలా రోజులు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దానితో అల్లు అర్జున్ ఒక అదిరిపోయే ప్లాన్ వేసినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే...  పుష్ప పార్ట్ 2 షూటింగ్ మొదలు అవ్వడానికి ఇంకా సమయం ఉండడం అలాగే,   సినిమా షూటింగ్ ప్రారంభం అయిన తరువాత చాలా రోజుల పాటు ఆ సినిమా పైనే పూర్తి సమయం కేటాయించి వలసి ఉండడంతో పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యే లోపు ఏదైనా సింపుల్ కథతో త్వరగా ఒక సినిమాను పూర్తి చేసి, ఆ తర్వాత పుష్ప పార్ట్ 2 మూవీ షూటింగ్ లో జాయిన్ అయితే బాగుంటుంది అనే ఆలోచనలో అల్లుఅర్జున్ ఉన్నట్లు ఒక వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది.  

ఇది ఇలా ఉంటే పుష్ప పార్ట్ 2 సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా ఒక కీలకమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే పుష్ప పార్ట్ 1 మూవీ మంచి విజయం సాధించడంతో పుష్ప పార్ట్ 2 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: