టాలీవుడ్ యంగ్ హీరోలలో ఒకరైన అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం వరుస పెట్టి ఈ సినిమాలలో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇలా వరుస పెట్టి క్రేజీ ప్రాజెక్ట్ లలో నటిస్తున్న నాగ చైతన్య ఒక సినిమా సెట్స్ పై ఉండగానే మరో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళుతూ ఫుల్ స్పీడ్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. 

ఇప్పటికే నాగ చైతన్య నటించిన థాంక్యూ సినిమా మరికొన్ని రోజుల్లో విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే ప్రస్తుతం దూత అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. దీనితో పాటు లాల్ సింగ్ చద్ద అనే హిందీ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఇలా ఇప్పటికే వరుస సినిమాలతో ఫుల్ స్పీడ్ ను చూపిస్తున్న నాగ చైతన్య తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో కూడా ఒక సినిమాలో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఇది ఇలా ఉంటే తాజాగా నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న  సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ను చిత్ర బృందం విడుదల చేసింది. నాగ చైతన్య , వెంకట్ ప్రభు కాంబినేషన్ లో తెరకెక్కబోతున్న సినిమాలో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించబోతున్నట్లు చిత్ర బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

ఇది వరకే నాగ చైతన్య, కృతి శెట్టి 'బంగార్రాజు' సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఈ మూవీలో వీరిద్దరి కెమిస్ట్రీ కి కూడా మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకున్న ఈ జంట మరోసారి వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమాలు కలిసి నటించబోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: